బాలిక‌పై అత్యాచారం: వీడియో తీసి, నెట్‌లో పోస్ట్ చేసిన కామాంధులు

తెలంగాణ‌లోని పెద్దప‌ల్లి జిల్లాలో పైశాచిక ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఇద్దరు కామాంధులు.. ఓ యువతిపై అత్యాచారం చేశారు. దాన్ని సెల్ ద్వారా వీడియో తీశారు. ఆ దృశ్యాల‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఈ వీడియోను మరికొందరు యువకులు డౌన్ లోడ్ చేసుకుని బాధితురాలిని బ్లాక్ మెయిల్ చేయడం ఆరంభించారు. త‌మ‌తో గ‌డ‌పాల‌ని, లేదంటే ఆ వీడియోల‌ను అంద‌రికీ చూపిస్తామ‌ని బెదిరించారు.

దీనితో బాధితురాలు, త‌న త‌ల్లితో క‌లిసి పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీనితో ఈ ఘ‌టన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు శ్రీ‌నివాస్‌, న‌గేష్ అనే ఇద్ద‌రు యువ‌కుల‌ను అరెస్టు చేశారు.

పెద్ద‌ప‌ల్లి జిల్లాలోని సుల్తానాబాద్ మండ‌ల ప‌రిధిలోని క‌దంపూర్‌లో అట‌వీ ప్రాంతంలో ఈ దారుణ ఘ‌ట‌న చోటు చేసుకుంది. క‌ట్టెల‌ను ఏరుకోవ‌డానికి బాధితురాలు వారం రోజుల కింద‌ట క‌దంపూర్ అటవీ ప్రాంతానికి వెళ్లింది.

ఆమెను గ‌మ‌నించిన శ్రీ‌నివాస్‌, న‌గేష్ అనుస‌రించారు. అట‌వీ ప్రాంతంలోకి లాక్కెళ్లి అత్యాచారం చేశారు. దాన్ని వీడియో తీసి, సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఈ విష‌యాన్ని ఎవ‌రికైనా చెబితే హ‌త‌మార్చుతామంటూ బెదిరించారు. దీనితో బాధిత బాలిక మౌనంగా ఉండిపోయింది. ఆ వీడియోను చూసిన మ‌రో న‌లుగురు యువ‌కులు ఆమె వెంట‌ప‌డ్డారు.

త‌మ‌తో ఏకాంతంగా గ‌డ‌పాల‌ని, లేదంటే వీడియోల‌ను అంద‌రికీ పంపిస్తామ‌ని బెదిరించారు. దీనితో బాధిత బాలిక ఈ విష‌యాన్ని త‌న త‌ల్లికి వివ‌రించారు.

వెంట‌నే వారు సుల్తానాబాద్ పోలీస్‌స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ఇద్ద‌ర్నీ అరెస్టు చేశారు. బాధితురాలిని ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

అత్యాచార ఘ‌ట‌న‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వారితో పాటు, ఆమెను బెదిరించిన మ‌రో న‌లుగురి కోసం అన్వేషిస్తున్న‌ట్లు చెప్పారు. వారిపై ప‌లు సెక్ష‌న్ల కింద కేసులు న‌మోదు చేశామ‌ని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here