బ్రేవోతో కలిసి కనిపించిన హీరోయిన్ గురించి చర్చ..!

చెన్నై సూపర్ కింగ్స్ క్రికెటర్ డ్వేన్ బ్రావో గురించి ప్రస్తుతం చర్చించుకుంటూ ఉన్నారు. మోడల్ యాక్ట్రెస్ అయిన నటాషా సూరితో కలిసి బ్రేవో కనిపించడమే ఇందుకు కారణం. ఇన్ సైడ్ ఎడ్జ్ అనే వెబ్ సిరీస్ లో నటాషా సూరీ నటించింది. వీరిద్దరూ 10 క్రితం తొలిసారి కలుసుకున్నారట. ముంబై లో 10 ఏళ్ల క్రితం కలుసుకున్న వీరిద్దరూ అప్పటి నుండి ఒకరికి ఒకరు బాగా పరిచయమయ్యారు. చాలా సార్లు కలిసి కనిపించారు కూడా. తాజాగా ముంబై లోని ఓ హోటల్ లో ఇద్దరూ కాఫీ తాగుతూ కనిపించారు.

ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ మొదలైనప్పుడు ఆమె తన సోషల్ మీడియా అకౌంట్ లో బ్రేవోకు ఆల్ ది బెస్ట్ చెబుతూ ఫోటోలను కూడా పోస్ట్ చేసింది. చెన్నై, ముంబై మధ్య జరిగిన మ్యాచ్ లో కూడా నటాషా హాజరైంది. ఈ మ్యాచ్ లో బ్రేవో అద్భుత ఇన్నింగ్స్ ఆడి తన జట్టును గెలిపించాడు. తన ఫోటోలను పోస్ట్ చేసే సమయంలో కూడా గో బ్రేవో.. గో..బ్రేవో అంటూ పలు పోస్టులు పెట్టింది.

https://www.instagram.com/p/BhT4OAmnmeJ/?utm_source=ig_embed

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here