చెన్నై మ్యాచ్ లు షిఫ్ట్ అయ్యింది ఇక్కడికే..!

చెన్నై లో ఐపీఎల్ మ్యాచ్ లు నిర్వహించడానికి ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి.. ఒక్క మ్యాచ్ నిర్వహించడానికే చాలా కష్టాలు పడ్డారు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ లను చెన్నై నుండి వేరే చోటుకు తరలించడానికి బీసీసీఐ అధికారులు మొగ్గు చూపారు. ఇప్పుడు చెన్నై హోమ్ గ్రౌండ్ గా పూణేను సెలెక్ట్ చేశారు.

కావేరీ జలాల వివాదం మరింత పెరుగగా, ఐపీఎల్ మ్యాచ్ లను అడ్డుకుంటామని బెదరింపులు రావడం, తొలి మ్యాచ్ లో క్రికెటర్లపై బూట్లు విసరడం వంటి ఘటనలతో ఆందోళన చెందిన బీసీసీఐ పెద్దలు, హోమ్ గ్రౌండ్ తరలింపు అంశాన్ని తెరపైకి తెచ్చారు. ఆపై నిన్న సమావేశమైన చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం, స్టేడియం మార్పును ఖరారు చేసింది. గత రెండేళ్లు ధోనీ పూణే సూపర్ జెయింట్స్ తరపున ఐపీఎల్ లో ఆడాడు. అందుకోసమే పూణే ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది.

పూణే లోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం.. చెన్నై కి చెందిన ఆరు మ్యాచ్ లనే కాకుండా.. మే23, 25వ తేదీల్లో జరగబోయే ఎలిమినేటర్.. క్వాలిఫయర్ మ్యాచ్ లకు కూడా ఆతిథ్యం ఇవ్వనుంది. చెన్నై నుండి మ్యాచ్ లను తరలించడం ఇదేమీ మొదటి సారి కాదు. 2014లో చెన్నైలో శ్రీలంక ఆటగాళ్ళను ఆడించకూడదు అని చెప్పినప్పుడు ‘రాంచీ’ లో మ్యాచ్ లను నిర్వహించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here