కారు లోపలికి వచ్చేసిన చిరుత.. అందరూ ఏమి చేశారంటే..!

సాధారణంగా సఫారీలకు వెళ్ళినప్పుడు.. కార్లలో కూర్చొని.. అక్కడ ఉన్న జంతువులను చూస్తూ ఉంటాం. కొన్ని కొన్ని సార్లు ఆ జంతువులు కార్ల మీదకు ఎక్కడం కూడా కొన్ని వీడియోలలో చూసి ఉండొచ్చు. అయితే ఏకంగా కారు లోపలికి రావడం జరిగితే.. అది కూడా అందులో మనిషులు కూడా ఉంటే.. వాళ్ళ గుండె ఆగిపోదూ..!

ఈ ఘటన టాంజానియాలో చోటుచేసుకుంది. అక్కడ ఉన్న సఫారీలో జంతువులను చూడడానికి గైడ్ తమ బృందాన్ని తీసుకొని వెళ్ళాడు. అయితే అక్కడ ఉన్నట్లుండి ఓ చిరుతపులి బృందం వచ్చింది. అందులో నుండి ఓ చిరుతపులి మొదట ఆ కారు ఎక్కింది. అలా కారు ఎక్కిన ఆ చిరుతపులి కారు అద్దాలు దించుకోకపోవడంతో ఏకంగా లోపలి వచ్చేసింది. అది లోపలి రాగానే గైడ్ అందులో ఉన్న వాళ్ళతో ‘దయచేసి శబ్దం చేయకుండా ప్రశాంతంగా ఉండండి’ అని చెప్పాడు. అతడు చెప్పినట్లు వాళ్ళు చేశారు. కొద్ది సేపు ఆ చిరుత కారులో ఉండి.. ఆ తర్వాత బయటకు వెళ్ళిపోయింది. దీంతో లోపల ఉన్నవాళ్ళంతా ఊపిరి పీల్చుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here