సాంబారులో బొద్దింక‌: హోట‌ల్ సిబ్బందిని ప్ర‌శ్నించ‌గా..వాళ్లిచ్చిన రియాక్ష‌న్ ఏమాత్రం ఊహించ‌నిదే!

అదో పేరున్న హోట‌ల్‌. చూడ్డానికి చాలా పోష్‌గా క‌నిపిస్తుంది. రోడ్డుప‌క్క‌నే ఉండ‌టంతో రోజూ కేఎస్ఆర్టీసీ బ‌స్సులు ఆ హోట‌ల్ వ‌ద్దే ఆగుతుంటాయి. లోపలి వ్య‌వ‌హారం మాత్రం తేడా. పైన ప‌టారం..లోన లొటారం టైప‌న్న‌మాట‌.

ఈ హోట‌ల్ ఏదో బాగుంది క‌దా అనుకుంటూ ఓ యువ‌కుడు త‌న కుటుంబంతో స‌హా టిఫిన్ చేయ‌డానికి వెళ్లాడు. దోసె ఆర్డ‌ర్ ఇచ్చాడు. టిఫిన్ చేస్తుండ‌గా.. సాంబారులో బొద్దింక క‌నిపించింది. బిత్త‌ర‌పోయిన ఆ యువ‌కుడు.. అదేమంటూ హోట‌ల్ సిబ్బందిని ప్ర‌శ్నించాడు.

ఆ స‌మ‌యంలో ఆ హోట‌ల్ సిబ్బంది ఇచ్చిన రియాక్ష‌న్‌ను ఆ యువ‌కుడు ఎప్పుడూ ఊహించి ఉండ‌డు. ప్ర‌శ్నించినందుకు కొట్టేంత ప‌ని చేశారు. ఇంకొక‌సారి త‌మ హోట‌ల్‌కు వ‌స్తే కాళ్లు విర‌గ్గొడ‌తామ‌నీ హెచ్చ‌రించారు.

రూపాయితో స‌హా మొత్తం బిల్లును వ‌సూలు చేశారు. ఈ ఘ‌ట‌న క‌ర్ణాట‌క‌లోని తుమ‌కూరులో చోటు చేసుకుంది. కొర‌ట‌గెరెకు చెందిన నాగ‌రాజు అనే యువ‌కుడు త‌న కుటుంబంతో స‌హా తుమ‌కూరు మ‌ల్ల‌సంద్ర ప్రాంతంలోని హ‌క్కిగూడు హోట‌ల్‌కు టిఫిన్ చేయ‌డానికి వెళ్లాడు.

సెట్ దోసెను ఆర్డ‌ర్ ఇచ్చాడు. దోసెతో పాటు చ‌ట్నీ, సాంబ‌ర్ తీసుకొచ్చారు స‌ర్వ‌ర్‌. రెండు సెట్‌దోసెలు తిన్న త‌రువాత నాగ‌రాజుకు సాంబ‌ర్‌లో బొద్దింక క‌నిపించింది.

దీనితో అత‌ను సిబ్బందిని పిలిచి, ప్ర‌శ్నించాడు. దీనితో వారు నాగ‌రాజు నోరు మూయించే ప్ర‌య‌త్నం చేశారు. అత‌ణ్ణి బెదిరించారు. భ‌య‌పెట్టారు. ఈ సంద‌ర్భంగా వారితో నాగ‌రాజు వాగ్వివాదానికి దిగాడు.

అయిన‌ప్ప‌టికీ.. సిబ్బంది ప‌ట్టించుకోలేదు. అత‌ణ్ణి, కుటుంబ స‌భ్యుల‌ను బ‌య‌టికి పంపించేశారు. టిఫిన్‌కు మొత్తం బిల్లును వ‌సూలు చేశారు. ఈ త‌తంగాన్నంతా నాగ‌రాజు కుటుంబీకులు సెల్‌ఫోన్‌లో వీడియో తీశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here