వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.. చేతులు నరికేశారు.. తెలుగు రాష్ట్రంలో విధించిన శిక్ష..!

వివాహేతర సంబంధాలు.. ఈ కాలంలో ఎన్నో సమస్యలకు దారితీస్తూ ఉన్నాయి.. కొన్ని కొన్ని సార్లు వాటి వలన తీవ్ర పరిణామాలు ఎదురవుతూ ఉంటాయి. వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ వ్యక్తికి మరచిపోలేని శిక్ష విధించారు. ఏకంగా రెండు చేతులూ నరికివేశారు. ఈ ఘటన విజయనగరం జిల్లా ఏజెన్సీలో చోటుచేసుకోవడంతో సంచలనం సృష్టిస్తోంది.

గుమ్మలక్ష్మీపురం మండలం ఇరిడి పంచాయతీ పరిధిలోని కొత్తగూడ కు చెందిన బిడ్డిక ధనుంజయకు ఆ ఊరి వాళ్ళు రెండు చేతులు నరికేశారు. అతను ఆ గ్రామానికి చెందిన మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడమే ఇందుకు కారణం. గతంలో ధనుంజయ, మహిళ వర్గాల మధ్య గొడవలు జరిగాయి. పద్ధతి మార్చుకోమని చాలా సార్లు ధనుంజయను హెచ్చరించారు. కానీ అతడు మారలేదు. దీంతో మహిళ వర్గానికి చెందిన పాడి శివన్నారాయణ, నరేష్‌, ప్రసాద్‌ లు గత అర్ధరాత్రి ధనుంజయపై దాడి చేశారు. అతన్ని ఓ ఇంట్లోకి తీసుకెళ్లి చేతులు, కాళ్లు కట్టేసి పదునైన ఆయుధంతో రెండు చేతులు నరికేశారు. అనంతరం బాధితుడ్ని గ్రామ సర్పంచ్ పద్మావతి ఇంటి ముందు వదిలి వెళ్లిపోయారు. దీంతో ఆమె పోలీసులకు సమాచారమందించగా.. నిందితులను అరెస్టు చేశారు పోలీసులు. ప్రస్తుతం బాధితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here