196 కేజీల‌ను ఎత్తి అవ‌త‌ల ప‌డేసింది: బ‌ంగారు ప‌త‌కాన్ని సాధించింది!

గోల్డ్ కోస్ట్: ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్‌లో ఆరంభ‌మైన కామ‌న్వెల్త్ క్రీడ‌ల్లో భార‌త్‌.. మ‌రో గోల్డ్ కొట్టింది. మ‌హిళ‌ల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో మీరాబాయి చాను బంగారు ప‌త‌కాన్ని సాధించారు. 48 కేజీల విభాగంలో ఆమె ఈ ఘ‌న‌త సాధించారు. మ‌ణిపూర్‌కు చెందిన మీరాబాయి.. ఈ విభాగంలో ప‌సిడిని అందుకోవ‌డం ఇదే తొలిసారి.

స్నాచ్‌, క్లీన్ అండ్ జెర్క్‌ల‌ల్లో ఆమెకు ఎదురే లేకుండా పోయింది. స్నాచ్‌లో 86 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 110 కేజీల బ‌రువును ఎత్తారు.

మారిష‌స్‌కు చెందిన హ‌నిత్ర 170 కేజీల లిఫ్టింగ్‌తో రెండో స్థానంలో శ్రీ‌లంక‌కు చెందిన దినుష 155 కేజీల బ‌రువును ఎత్తి మూడో స్థానంలో నిలిచారు. ఈ బంగారు ప‌త‌కం ద్వారా మీరాబాయి త‌న వ్య‌క్తిగ‌త రికార్డును కూడా స‌వ‌రించుకున్నారు. ఇప్ప‌టిదాకా 80 కేజీల వెయిట్ లిఫ్టింగే ఆమె వ్య‌క్తిగ‌త రికార్డుగా కొన‌సాగింది. ఇప్పుడామె దీన్ని బ్రేక్ చేశారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here