గ‌ర్భిణి హ‌త్య కేసు: క‌ట్ట‌ర్‌తో ముక్క‌లు చేసి..గోనెసంచిలో చుట్టి..బొటానిక‌ల్ గార్డెన్ వ‌ద్ద ప‌డేశారు

హైద‌రాబాద్‌: న‌గ‌రంలోని కొండాపూర్ బొటానిక‌ల్ గార్డెన్ వ‌ద్ద రెండు గోనెసంచుల్లో ల‌భించిన గ‌ర్భిణీ హ‌త్యోదంతం వెనుక ప‌లు షాకింగ్ కోణాలు వెలుగులోకి వ‌చ్చాయి. వివాహేత‌ర సంబంధం పెట్టుకోవ‌డం వ‌ల్లే ఆమెను దారుణంగా హ‌త‌మార్చిన‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు.

తాను వివాహేత‌ర సంబంధాన్ని కొన‌సాగిస్తున్న మ‌మ‌త ఝాతో క‌లిసి వికాస్ అనే వ్య‌క్తి త‌న భార్య బింగీని దారుణంగా హ‌త‌మార్చిన‌ట్లు తెలిపారు. ఈ హ‌త్యోదంతంలో ఇద్దరిని అరెస్టు చేశామ‌ని, మరో ఇద్దరిని బీహార్‌లో అదుపులోకి తీసుకున్నట్లు సైబ‌రాబాద్ క‌మిష‌న‌ర్ సందీప్ శాండిల్య తెలిపారు.

 

బిహార్‌ బాంకా జిల్లా మోహన మాలతి గ్రామానికి చెందిన మమత ఝా, ఆమె భర్త అనిల్ ఝా, కుమారుడు అమర్ కాంత్ ఝా జీవనోపాధి కోసం నగరానికి వచ్చి సిద్ధిఖీ నగర్‌లో ఉంటున్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన వికాస్ కుంటుంబంతో పరిచయం ఏర్పడింది. వికాస్ సిద్ధిఖీన‌గ‌ర్‌లో ఛాట్ భ‌డార్ షాప్‌ను నిర్వ‌హిస్తున్నాడు.

గ‌తంలో వికాస్ రాజస్థాన్‌లో ఇటుకల బట్టీలో పనిచేశాడు. ఆ సమయంలో మృతురాలు తండ్రి లోయా కూడా అక్కడే పని చేసేవాడు. అదే స‌మ‌యంలో లోయా భార్య తన కుమార్తె బింగీ అలియాస్ పింకీని తీసుకుని రాజస్థాన్‌కు వచ్చింది.

13 సంవత్సరాల కింద‌టే బింగీకి వికాస్‌తో వివాహ‌మైంది. వారికి పిల్ల‌లు. బింగీ మ‌రోసారి గ‌ర్భం దాల్చ‌డంతో ఆమెను బిహార్‌లో వ‌దిలేసి, తాను ఒంట‌రిగా హైదరాబాద్‌కు వ‌చ్చాడు. ఇక్క‌డ వికాస్‌కు మమత ఝా కుటుంబంతో పరిచయం ఏర్పడింది.

సిద్ధిఖీనగర్‌లో ఇల్లు అద్దెకు తీసుకున్నారు. త‌న భ‌ర్త వ‌య‌స్సు 75 సంవ‌త్స‌రాలు కావ‌డంతో వికాసే తన భర్త అని మమత చెబుతుండేది. ఈ నేప‌థ్యంలో ఇద్ద‌రి మ‌ధ్యా వివాహేత‌ర సంబంధం ఏర్ప‌డింది. త‌న భ‌ర్త ఎంత‌కీ త‌న‌ను హైద‌రాబాద్‌కు తీసుకెళ్ల‌క‌పోవ‌డంతో వికాస్ భార్య బింగీ స్వ‌యంగా తానే కొద్దిరోజుల కింద‌ట కుమారుడు జతిన్‌తో క‌లిసి సిద్ధిఖీ నగర్‌కు వచ్చింది.

ఆమె న‌గ‌రానికి వ‌చ్చిన త‌రువాత అస‌లు విష‌యం తెలుసుకుంది. త‌న భ‌ర్త వికాస్‌, మ‌మ‌త ఝా మ‌ధ్య వివాహేత‌ర సంబంధం ఉంద‌నే విష‌యం తేలింది. బింగీ ఇంట్లో ఉండడంతో వికాస్‌తో ఉన్న అక్రమ సంబంధానికి అడ్డుగా ఉందని భావించి మ‌మ‌త‌ఝాతో క‌లిసి వికాస్ త‌న భార్య బింగీని హ‌త్య చేశాడు.

కింద‌టి నెల 28న బింగీని హత్య చేసి నిందితులు..ఒక రోజు మృతదేహన్ని ఇంట్లో ఉంచుకున్నారని వివరించారు. మమత కుమారుడు అమర్ కాంత్ ఝా కూడా వారికి స‌హ‌క‌రించాడు.

వ‌డ్రంగులు వినియోగించే కటర్ స‌హాయంతో బింగీ మృతదేహాన్ని ముక్కలుగా చేసి ప్లాస్టిక్, బియ్యం సంచుల్లో మూట కట్టుకుని బైక్‌పై తీసుకుని వచ్చి బొటానికిల్ గార్డెన్ వద్ద పడవేసి వెళ్లారని క‌మిష‌న‌ర్ తెలిపారు.

బైక్ ఎలా వచ్చిందో పరిశీలించగా సిద్ధిఖీ నగర్ నుంచి టెక్ మహేంద్ర మీదుగా కొత్తగూడ, బొటానికల్ వైపు వచ్చినట్లు గుర్తించామని సందీప్ శాండిల్య తెలిపారు.

హ‌త్య చేసిన మ‌రుస‌టి రోజే వికాస్ బిహార్‌కు పారిపోయాడని చెప్పారు. 10న కార్డెన్ సెర్చ్ చేస్తున్న సమయంలో అమర్‌కాంత్ పరారైనట్టు చెప్పారు.

పరారీలో ఉన్న వికాస్, అమర్‌ను బీహార్‌లో తమ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారని, నగరానికి తీసుకొస్త్తున్నట్లు సీపీ వివరించారు.

మమతను ఆమె భర్త అనిల్ ఝాను అరెస్టు చేసినట్లు సందీప్ శాండిల్య పేర్కొన్నారు. మృతురాలి కుమారుడు జతిన్‌ను వెల్‌ఫేర్ హోమ్‌లో చేర్పించినట్లు పోలీసులు చెప్పారు.

కేసులో ప్రధాన ముద్దాయి మమతేనని పేర్కొన్నారు. నిందితుల ఇంట్లో నుంచి కటర్, ఇతర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here