గ‌ల్ఫ్ కార్మికులకు ప‌ని లేకుండా చేస్తోన్న మెకును తుఫాన్‌

మెకును తుఫాన్ ధాటికి గ‌ల్ఫ్ దేశాలు అల్లాడిపోతున్నాయి. ప్ర‌త్యేకించి- ఒమ‌న్‌పై ఈ తుఫాన్ ప్ర‌భావం తీవ్రంగా ఉంటోంది. ఈ తుఫాన్ ప్ర‌భావంతో ఒమ‌న్ తీర ప్రాంత న‌గ‌ర‌మైన స‌లాలాలో ఇప్ప‌టికే భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. ప్ర‌స్తుతం స‌లాలా న‌గ‌రానికి 350 కిలోమీట‌ర్ల దూరంలో, అరేబియా స‌ముద్రంలో కేంద్రీకృత‌మైన మెకును తుఫాన్ గంట‌కు 10 కిలోమీట‌ర్ల వేగంతో క‌దులుతోంది.

 

యెమెన్ ఆధీనంలో ఉన్న సొకొట్రా ద్వీపానికి 190 కిలోమీట‌ర్ల దూరంలో ఉంది. 190 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న‌ప్ప‌టికీ.. సొకొట్రా ద్వీపంపై తుఫాను పెను ప్ర‌భావాన్ని చూపుతోంది. ఈదురు గాలుల‌తో కురుస్తున్న భారీ వ‌ర్షాల‌కు ఈ చిన్న ద్వీపం చిగురుటాకులా వ‌ణికిపోతోంది. ఇప్ప‌టికే ఈ ద్వీపంలో 40 మంది గల్లంత‌య్యారు.

వారిలో 17 మంది మ‌ర‌ణించి ఉంటార‌ని అధికారులు ధృవీక‌రించారు. గ‌ల్లంత‌యిన వారిలో భార‌తీయులే అధిక సంఖ్య‌లో ఉన్న‌ట్లు చెబుతున్నారు.

 

ప‌ల్లపు ప్రాంతాల్లో ఉన్న 230 కుటుంబాల‌ను అధికారులు సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించారు. తుఫాను ధాటికి సొకొట్రాలో విద్యుత్ స‌ర‌ఫ‌రా స్తంభించిపోయింది. ఫోన్లు ప‌నిచేయ‌ట్లేదు. తుఫాను ప్ర‌భావం త‌గ్గిన వెంట‌నే సొకొట్రాకు స‌హాయక బృందాల‌ను పంపిస్తామ‌ని యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్‌, సౌదీ అరేబియా దేశాలు ప్ర‌క‌టించాయి.

క్ర‌మంగా ఈ తుపాను స‌లాలా వైపు దూసుకొస్తోంది. దీని ప్ర‌భావంతో.. స‌లాలాలో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. అక్క‌డి వీధుల‌న్నీ వాన‌నీటితో నిండిపోయాయి. తుఫాన్ తీవ్ర‌త‌ను దృష్టిలో పెట్టుకుని ప్రైవేటు సంస్థ‌ల‌న్నీ త‌మ కార్య‌క‌లాపాల‌ను నిలిపివేశాయి.

సుమారు 600 మంది కార్మికుల‌ను అధికారులు స‌లాలా ప‌శ్చిమ ప్రాంతంలోని ఓ ప్రభుత్వ పాఠ‌శాల‌కు త‌ర‌లించారు. అక్క‌డ వారు త‌ల‌దాచుకుంటున్నారు. ప్రైవేటు సంస్థ‌లు త‌మ కార్య‌కలాపాల‌ను నిలిపివేయ‌డంతో కార్మికులు ఉపాధిని కోల్పోయారు. స‌లాలా అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యాన్ని కూడా అధికారులు ఇదివ‌ర‌కే మూసివేశారు. మ‌రో 24 గంట‌ల పాటు విమానాశ్ర‌యాన్ని మూసి వేసే అవ‌కాశాలు ఉన్నాయ‌ని చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here