అచ్చం దంగల్ సినిమాలో లాగే..!

అమీర్ ఖాన్ హీరోగా రూపొందిన ‘దంగల్’ క్లైమాక్స్ లో కూతురి ఫైనల్ మ్యాచ్ ను చూడకుండా కోచ్ అడ్డుకుంటాడు. అచ్చం అలాంటి ఘటనే మరోసారి చోటుచేసుకుంది. అది కూడా మహావీర్ ఫోగట్ కే జరిగింది. అయితే ఇక్కడ ఆయన్ను ఎవరూ బంధించలేదు కానీ.. టికెట్లు ఇవ్వలేదు అంతే.. దీంతో బబిత స్వర్ణ పతకాన్ని గెలిచిన మ్యాచ్ ను ఆయన చూడలేకపోయారు.


గోల్డ్ కోస్ట్ లో జరుగుతున్న కామన్వెల్త్ పోటీల్లో బబిత 53 కేజీల విభాగంలో భారత్ కు ప్రాతినిథ్యం వహించింది. అద్భుతంగా రాణించి ఫైనల్ కు కూడా చేరుకుంది. ఆమె ఫైనల్ మ్యాచ్ ను చూసేందుకు మహావీర్ స్టేడియానికి వెళ్ళారు.. కానీ బయటే ఆగిపోయారు. తొలి మూడు బౌట్ లనూ ఆయన చూడలేక పోయారు. చివరకు ఆస్ట్రేలియా రెజర్లకు ఇచ్చిన ఓ టికెట్ తో ఆయన లోపలికి వెళ్లి చివరి క్షణాలను మాత్రం చూడగలిగారు.


రెజ్లింగ్ కోచ్ తోమర్ కు తాము ఐదు టికెట్లు ఇచ్చామని, వాటిల్లో ఒకటి మహావీర్ కు ఎందుకు అందలేదో తెలియది అధికారులు చెప్పారు. ఇక ప్రతి అథ్లెట్ కూ రెండు టికెట్లు ఇస్తారని చెప్పిన బబిత, రాత్రి వరకూ తాను ఎన్నిసార్లు ప్రయత్నించినా, అధికారులు తనకు టికెట్లు ఇవ్వలేదని ఆరోపించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here