సూప‌ర్‌స్టార్‌ను ఇంటికి ర‌ప్పించుకుంది! కారులో ఆయ‌న‌తో క‌లిసి ప్ర‌యాణం చేసింది..!

బెంగ‌ళూరు: హీరోల‌ను దేవుళ్ల కంటే ఎక్కువ‌గా కొలుస్తుంటారు ప్రేక్ష‌కులు. జీవితంలో ఒక్క‌సారైనా వారిని క‌లుసుకోవాల‌ని, ఫొటో దిగాల‌ని కోరుకోని అభిమాని ఎవ‌రూ ఉండరు. మృత్యువు ముంగింట్లో ఉన్న ఓ బాలిక కూడా ఇంతే. త‌న అభిమాన క‌థా నాయ‌కుడిని క‌లుసుకోవడానికి విశ్వ ప్ర‌య‌త్నాలు చేశారు. చివ‌రికి.. త‌న చివ‌రి కోరిక‌ను తీర్చుకోగ‌లిగారు.

ఆ అభిమాని పేరు పూర్విక‌. క‌ర్ణాట‌క‌లోని మండ్యకు చెందిన ఆ బాలిక‌కు ఛాలెంజింగ్ స్టార్ ద‌ర్శ‌న్ అంటే అభిమానం. 11 సంవ‌త్స‌రాల పూర్విక గుండె సంబంధిత వ్యాధితో బాధ‌ప‌డుతున్నారు. ఆమె క‌డుపులో నీరు చేరింది.

దీనితో ఎక్కువ రోజులు జీవించే అవ‌కాశం లేద‌ని డాక్ట‌ర్లు వెల్ల‌డించారు. దీనితో చివ‌రి కోరిక‌గా త‌న అభిమాన హీరోను క‌లుసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఓ స్వ‌చ్ఛంద సంస్థ ప్ర‌తినిధుల ద్వారా ఈ విష‌యాన్ని ద‌ర్శ‌న్‌కు చేరవేశారు.

`య‌జ‌మాని` షూటింగ్‌లో బిజీగా ఉన్న‌ప్ప‌టికీ.. ఈ విష‌యం తెలుసుకున్న వెంట‌నే స్వ‌యంగా ఆ బాలిక ఇంటికి వెళ్లారు. ఆ బాలిక‌ను ఒడిలో కూర్చోబెట్టుకుని చాలాసేపు ముచ్చ‌టించారు. వైద్యం కోసం కొంత మొత్తాన్ని ఇచ్చారు. ప్ర‌స్తుతం ఆ బాలిక చిక్‌మ‌గ‌ళూరు ఆసుప‌త్రిలో చికిత్స తీసుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here