హిట్ అండ్ ర‌న్‌! తండ్రి క‌ళ్ల ముందే..ప్రాణాలు విడిచిన కుమార్తె!

బెంగ‌ళూరు: రోడ్డుప్ర‌మాదంలో ఓ విద్యార్థిని దుర్మ‌ర‌ణం పాలైన ఘ‌ట‌న బెంగ‌ళూరు వెస్ట్ ఆఫ్ కార్డ్ మార్గంలో చోటు చేసుకుంది. విద్యార్థినిని ఢీ కొట్టిన త‌రువాత డ్రైవ‌ర్ బ‌స్సును ఆప‌కుండా వెళ్లిపోయాడు. హిట్ అండ్ ర‌న్‌గా కేసు న‌మోదు చేసిన పోలీసులు ఆ డ్రైవ‌ర్‌ను అరెస్టు చేశారు. ఆ డ్రైవ‌ర్ పేరు ప్ర‌శాంత్‌. ఎస్ఆర్ఎస్ బ‌స్ డ్రైవ‌ర్‌.

మంగ‌ళ‌వారం రాత్రి వెస్ట్ ఆఫ్ కార్డ్ మార్గంలోని వినాయ‌కుడి ఆల‌యం స‌మీపంలో ఛైత్ర అనే విద్యార్థిని ఢీ కొట్టి వెళ్లిపోయాడు. ఛైత్ర బీకామ్ విద్యార్థిని. కావేరి క‌ళాశాల విద్యార్థిని ఆమె. లెక్చ‌ర‌ర్ పెళ్లికి హాజ‌రు కావ‌డానికి త‌న తండ్రితో క‌లిసి బైక్‌పై రాజాజీన‌గ‌ర‌కు వెళ్తుండ‌గా.. ఈ ప్ర‌మాదం చోటు చేసుకుంది.

ఎస్ఆర్ఎస్ బ‌స్ బైక్‌ను ఢీ కొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో ఛైత్ర సంఘ‌ట‌నాస్థ‌లంలో, త‌న తండ్రి క‌ళ్లెదుటే మ‌ర‌ణించారు. ఈ ఘ‌ట‌న‌పై మ‌ల్లేశ్వ‌రం పోలీస్‌స్టేష‌న్‌లో కేసు న‌మోదైంది. కేసు న‌మోదు చేసిన మ‌ల్లేశ్వ‌రం ఇన్‌స్పెక్ట‌ర్ అంజుమాలా బ‌స్ డ్రైవ‌ర్ కోసం గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు. గంట‌ల వ్య‌వ‌ధిలో డ్రైవ‌ర్ ప్రశాంత్‌ను అరెస్టు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here