తల్లి 100వ పుట్టినరోజు జరిపించడానికి కెనెడా నుండి వచ్చిన కూతురు.. దేవుడు రాసిన రాత మరోలా..!

తల్లి 100వ పుట్టినరోజును నిర్వహించడానికి కూతురు కెనెడా నుండి వచ్చింది.. ఎంతో ఉత్సాహంగా అన్ని కార్యక్రమాలు పూర్తీ చేసేసింది. పార్టీ కూడా ఎంతో గ్రాండ్ గా ఇచ్చారు. తల్లి తన పుట్టినరోజు కేక్ కోసిన కొన్ని నిమిషాల తర్వాత ఒక్కసారిగా కూతురు కుప్పకూలిపోయింది. అప్పటి దాకా ఎంతో యాక్టివ్ గా పనులు చేసిన ఆ కూతురు అలా కిందకు పడిపోవడంతో అందరూ ఎంతో టెన్షన్ పడ్డారు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తీసుకొని వెళ్ళగా ఆమె చనిపోయిందని వైద్యులు తెలిపారు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రం లోని మంగళూరులో చోటుచేసుకుంది.

మంగళూరులోని పాండేశ్వర నివాసి గ్లాడి డిసౌజా వయసు 100 సంవత్సరాలు. మార్చి 30న ఆమె పుట్టినరోజును ఘనంగా నిర్వహించాలని కుటుంబసభ్యులు అనుకున్నారు. ఆమె కూతురు గ్లోరియా లోబో వయసు 75 సంవత్సరాలు. కెనెడాలో నివసిస్తున్న లోబో తల్లి పుట్టినరోజు కోసం భారత్ కు రెండు వారాల క్రితం వచ్చింది. వయో వృద్ధుల ఆశ్రమంలో తల్లి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించాలని అనుకున్నారు.

 

అనుకున్నట్లుగానే కుటుంబ సభ్యుల సమక్ష్యంలో గ్లాడి డిసౌజా పుట్టినరోజును నిర్వహించారు. తన తల్లికి సంబంధించిన ఫోటోలను చూపిస్తూ గ్లోరియా ప్రత్యేకంగా ఓ ప్రదర్శన ఇచ్చింది.. అందులో తన తల్లి ఏ వయసులో ఎలా ఉందో చెప్పుకుంటూ వచ్చింది. కేక్ కట్ చేసినప్పుడు అమ్మకోసం ప్రత్యేకంగా కవిత చెప్పింది. ఇలా అంతా సందడిగా ఉన్న సమయంలో కొద్ది నిమిషాల తర్వాత గ్లోరియా కుప్పకూలిపోయింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తీసుకొని వెళ్ళారు. ఆసుపత్రిలోనే ఆమె కన్నుమూసిందని కుటుంబసభ్యులు ధృవీకరించారు. దేవుడు రాసిన రాత ఎంత విచిత్రమో కదా అని అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here