వార్నర్ కుటుంబాన్ని ఎంతగానో చిదిమేసిన బాల్ టాంపరింగ్.. చివరికి భార్యకు అబార్షన్..!

బాల్ టాంపరింగ్ వివాదం ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ జీవితంలో ఎన్నో మార్పులు తీసుకొని వచ్చింది. గొప్ప ఆటగాడిగా ఎదుగుతున్న సమయంలో వార్నర్ చేసిన ఈ తప్పు అతని కెరీర్ నే ప్రమాదంలో నెట్టేసింది. ఇక ఈ అంశం వారి కుటుంబంపై కూడా పడింది. ఆ అంశాలను వార్నర్ భార్య ఇటీవల మీడియాతో పంచుకుంది.


కేప్‌టౌన్‌లోనే డేవిడ్ తనను ప్రేమిస్తున్నట్టు చెప్పాడని, టెస్ట్ సిరీస్ కోసం మళ్లీ అక్కడికి వచ్చినప్పుడే తాను గర్భవతినని తెలిసిందని క్యాండీస్ పేర్కొంది. చిన్నారి వార్నర్ రాబోతున్నందుకు ఇద్దరం చాలా సంతోషించామని, కానీ బాల్ ట్యాంపరింగ్ వివాదం తమ జీవితాల్లో విషాదం నింపిందని ఆవేదన వ్యక్తం చేసింది. ట్యాంపరింగ్ వ్యవహారాన్ని తట్టుకోలేని ఆసీస్ అభిమానులు వార్నర్ భార్య క్యాండీస్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అసభ్య పదజాలంతో దూషించారు. అప్పటికే గర్భవతిగా ఉన్న క్యాండీస్ అభిమానుల విమర్శలు, వ్యక్తిగత దూషణల కారణంగా తీవ్ర ఒత్తిడికి లోనైంది. దీనికి తోడు క్రికెట్ ఆస్ట్రేలియా పిలుపుతో సుదీర్ఘంగా ప్రయాణం చేసి ఆస్ట్రేలియా చేరుకోవాల్సి రావడం.. తదితర కారణాల వల్ల క్యాండీస్‌కు గర్భస్రావమైంది. ఇలా జరుగుతుందని తాము అసలు ఊహించలేదని క్యాండీస్ చెప్పుకొచ్చింది. దాదాపు 23 గంటల పాటూ అప్పుడుఏకధాటిగా ప్రయాణించడమే క్యాండీస్ గర్భస్రావానికి కారణమని వైద్యులు చెప్పారట.. మూడో బిడ్డను వార్నర్ కు ఇద్దామని అనుకున్నానని కానీ అది జరగలేదని క్యాండీస్ చెప్పుకొచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here