హైదరాబాద్ లోని ఓ సెలెబ్రిటీని చంపేయాలని అనుకున్న దావూద్.. 45లక్షలు ఇచ్చాడు..!

దావూద్ ఇబ్రహీం.. ఈ అండర్ వరల్డ్ డాన్ ఇప్పుడు పాకిస్థాన్ లో హ్యాపీగా కూర్చొన్నాడు. అక్కడి నుండే తన బ్యాచ్ తో భారత్ లో పనులు చేయిస్తూ ఉన్నాడు. ఇలాంటి సమయంలో ఓ హైదరాబాద్ సెలెబ్రిటీని చంపేయాలని దావూద్ నిర్ణయించాడట.. ఏకంగా 45లక్షల రూపాయలు ఓ షార్ప్ షూటర్ కు ఇచ్చారట కూడానూ..! పోలీసులు కానీ అతన్ని అదుపులోకి తీసుకోకుండా ఉండి ఉంటే ఇవాల్టికి ఆ ప్లాన్ అమలైపోయుండేది. హైదరాబాదులో డీ-గ్యాంగ్ టార్గెట్ చేసిన సెలబ్రిటీ ఎవరు? అతడిని టార్గెట్‌ చేయాల్సిన అవసరం దావూద్ కు ఎందుకు వచ్చింది? అనేవి తేలాల్సి ఉంది.

గత నవంబర్ లో ఢిల్లీ నార్త్ ఈస్ట్ పోలీసులు షార్ప్‌ షూటర్‌ నసీం అలియాస్‌ రిజ్వాన్‌ ను అరెస్టు చేయగా హైదరాబాదులోని సెలబ్రిటీని డీ-గ్యాంగ్ టార్గెట్ చేసిందన్న విషయాన్ని బయటపెట్టాడు. హైదరాబాదులో ఆ సెలబ్రిటీని చంపేందుకు చోటా షకీల్‌ తో 45 లక్షల రూపాయల సుపారీకి ఒప్పందం చేసుకున్నారు. ఈ ఆపరేషన్‌ ను ఉత్తరప్రదేశ్‌ కు చెందిన గ్యాంగ్‌ స్టర్‌ మున్నా సింగ్‌ తో కలసి చేయాలని షకీల్‌ ఆదేశించినట్టు తెలుస్తోంది. మున్నాసింగ్ ను కలిసే ప్రయత్నాల్లో ఉండగా, నసీం ప్రధాన అనుచరుడు జునైద్ చౌదరి ఇచ్చిన పక్కా సమాచారంతో నసీంను ఢిల్లీ పోలీసులు గుర్గావ్ లో అరెస్టు చేశారు. పోలీసులు మరింత సమాచారం రాబట్టే పనిలో ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here