ఒంటిమిట్ట చెరువులో 7 శవాలు.. ఇంతకూ ఏమి జరిగింది..!

సినిమాల్లో నీళ్ళు తీసుకురావడానికి చెరువు దగ్గరకు వెళ్ళిన వారికి మృతదేహాలు కనిపించినట్లు.. కడప జిల్లాలోని ఒంటి మిట్ట వద్ద చెరువులో ఏడు మృతదేహాలు కనిపించాయి. ఒక శవం తర్వాత మరో శవం.. ఇలా మొత్తం ఏడు శవాలు ఇప్పటిదాకా బయటకు వచ్చాయి. ప్రముఖ పుణ్యక్షేత్రం ఒంటిమిట్ట సమీపంలో కడప-తిరుపతి హైవే రోడ్డు పక్కన ఉన్న చెరువులో ఈ మృతదేహాలు కనిపించాయి.

చెరువు వైపు వెళ్తున్న స్థానికులు చెరువులో మృతదేహాలను చూసి పోలీసులకు సమాచారం అందించడంతో వారు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను వెలికి తీయించి చెరువులో ఇంకా ఏమైనా శవాలు ఉన్నాయా అని చూస్తున్నారు.

అయితే చనిపోయిన వారంతా ఎర్రచందనం కూలీలుగా పోలీసులు అనుమానిస్తున్నారు. శనివారం రాత్రి ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్న ఓ లారీని పోలీసులు వెంబడించారు. ఆ లారీలో ఉన్న కూలీలలో కొందరు పోలీసుల నుంచి తప్పించుకునేందుకు చెరువులోకి దూకి ఉంటారని భావిస్తున్నారు. అయితే వాళ్ళు చెరువులో దూకి మరణించారా.. లేక మరేదైనా కారణంతో మరణించారా అన్న నిజాలు బయటకు రావాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here