కృష్ణానదిలో దొరికిన శవం.. కీచకుడు సుబ్బయ్యదేనా..?

గుంటూరు జిల్లా దాచేపల్లిలో చిన్నారి బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన కీచకుడు సుబ్బయ్య, కృష్ణానదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. బుధవారం రాత్రి సుబ్బయ్య ఫోన్ చేశాడు. ఈ పని ఎందుకు చేశావని బంధువులు అడుగగా.. దానికి సమాధానం చెప్పలేదు. ఇక తానింక బతకనని, చనిపోతున్నానని చెప్పాడట. ఈ విషయాన్ని సుబ్బయ్య బంధువులు వెంటనే పోలీసులకు తెలిపారు. అతని సెల్ ఫోన్ సిగ్నల్ ను ట్రాక్ చేయగా, అది అక్కడికి సమీపంలోనే ఉన్న కృష్ణానది తీర గ్రామమైన తంగెడ సెల్ టవర్ ను చూపించింది.


చచ్చిపోతున్నానని చెప్పిన తరువాత, నదిలో గాలింపు ప్రారంభించిన గజ ఈతగాళ్లు, పోలీసుల బృందానికి ఓ మృతదేహం కనిపించింది. ఇది సుబ్బయ్యదేనా? అన్న విషయాన్ని ధ్రువీకరించాల్సి వుందని పోలీసు వర్గాలు అంటున్నాయి. గత రెండు రోజులుగా నిరసనలతో దాచేపల్లి అట్టుడుకుతోంది. 9 ఏళ్ల అమ్మాయిని 50 ఏళ్ల పైబడిన సుబ్బయ్య చాక్లెట్ కొనిస్తానని పిల్చుకొని వెళ్ళాడు. అతడి మాటలు నమ్మిన ఆ అమ్మాయి వెళ్ళింది. తీరా అతడు ఆమెను అత్యాచారం చేసి ఇంటి వద్ద వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అనంతరం విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించి ఆ బాలికను ఆమె ఇంటి వద్ద దింపేసి వెళ్లిపోయాడు. బాలికకు కడుపు నొప్పి రావడంతో తల్లిదండ్రులు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు ఆ చిన్నారిని పరిశీలించగా జరిగిన ఘోరం బయటపడింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here