డోన్-గుంటూరు ప్యాసింజర్ రైలు.. బాత్ రూమ్ లో చూస్తే.. వణికిన ప్రయాణీకులు..!

ఎప్పుడూ ప్రయాణీకులతో కిటకిటలాడే డోన్-గుంటూరు ప్యాసింజర్ రైలులో ఈరోజు జరిగిన ఓ ఘటన అందరూ షాక్ అయ్యేలా చేసింది. ఆ సంఘటన చూసిన వాళ్ళంతా ఒక్కసారిగా అవాక్కయిపోయారు. ఎందుకంటే ఏకంగా గార్డునే చంపేశారు.

డోన్- గుంటూరు ప్యాసింజర్ రైలులో గార్డుగా ఉన్న కేవీ రావును గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. చాలా సేపు ఆయన ఎవరికీ కనిపించలేదు. దీంతోగుండ్లకమ్మ రైల్వేస్టేషన్ వద్ద బాత్రూమ్‌లను పరిశీలిస్తుండగా కేవీ రావు మృతదేహం కన్పించింది. వెంటనే మృతదేహాన్ని అదే రైలులో నర్సరావుపేటకు తరలించారు. కేవీ రావు మృతదేహంపై కత్తిపోట్లు అలాగే.. కేవీరావు తలపై గాయాలున్నట్టు గుర్తించారు. కేవీరావును ఎవరు హత్య చేశారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం సీసీటీవీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. మృతదేహాన్ని చూసిన ప్రయాణీకులు ఎంతగానో భయపడ్డారు. ఎవరో పక్కా ప్లాన్ ప్రకారమే ఆయన్ను చంపి ఉంటారని అనుమానిస్తున్నారు పోలీసులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here