సముద్రంలో నుండి పామును తీసుకొని వచ్చి మింగేసింది..!

సముద్రంలో ఉన్న పామును ఓ పక్షి ఒడ్డుకు తీసుకొని వచ్చింది.. అయితే ఆ పాము తప్పించుకోడానికి ఎంత ప్రయత్నించినా వీలు పడలేదు. అది బ్రతికిఉండగానే మింగేసింది ఆ పక్షి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

షగ్ అనే సముద్ర పక్షి దక్షిణ ఆస్ట్రేలియాలోని రాకింగ్ హామ్ లో ఉన్న మాంగల్స్ బీచ్ వద్దకు ఎగురుకుంటూ వచ్చింది. అక్కడికి అలెక్స్ అనే వ్యక్తి తన కుక్కతో వచ్చాడు. ఆ సముద్ర పక్షి నోటిని గమనిస్తే అక్కడ ఓ పామును ఉంది. వెంటనే తన ఫోన్ తో రికార్డు చేయడం మొదలుపెట్టాడు అలెక్స్. ఆపాము తప్పించుకోవాలని ఎంతగా ప్రయత్నిస్తున్నా కూడా ఆ పాము వదలలేదు. క్షణాల్లో ఆ పామును మింగేసింది. ఆ పాము ఆస్ట్రేలియాలోని విషపూరితమైన పాముల్లో ఒకటని అలెక్స్ తెలిపాడు. పాముకు ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వకుండా ఆ పక్షి మింగేసిందని అలెక్స్ తెలిపాడు. ఇలా ఓ సముద్ర పక్షి బ్రతికి ఉన్న పామును మింగేయడం చూడడం ఇదే తొలిసారని అలెక్స్ తెలిపాడు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here