లేటెస్ట్ బెస్ట్ క్యాచ్.. క్రికెట్ ప్రేమికులు ఎవరైనా చూడాల్సిందే..!

దక్షిణాఫ్రికా ఆటగాడు డీన్ ఎల్గర్ పట్టిన క్యాచ్ ను సోషల్ మీడియాలో అభిమానులు తెగ షేర్లు చేస్తూ ఉన్నారు. టెస్టు క్రికెట్ చరిత్రలోనే ఇది అద్భుతమైన క్యాచ్ అని పేర్కొంటున్నారు. ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో ఈ అద్భుతమైన క్యాచ్ పట్టాడు ఎల్గర్.

ఇప్పటికే సిరీస్ కోల్పోయిన ఆసీస్.. ఈ మ్యాచ్ లో ఓటమి దిశగా సాగుతోంది. ఈ మ్యాచ్ లో ఒంటరిపోరాటం చేస్తున్న పైన్ 62 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రబడా వేసిన బంతిని మిడ్ వికెట్ మీదుగా ఆడే ప్రయత్నం చేశాడు. దీనిని ఆపేందుకు పరుగెత్తిన ఎల్గర్ మెరుపు వేగంతో అమాంతం గాల్లోకి లేచి బంతిని ఒడిసిపట్టాడు. దీంతో 221 పరుగుల వద్ద ఆసీస్ ఇన్నింగ్స్ ముగిసింది. ఎవరూ ఊహించని విధంగా బంతిని క్యాచ్ పట్టేయడంతో అభిమానులు కేరింతలు కొట్టారు.

ఈ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో సౌత్ ఆఫ్రికా 488 పరుగులు చేయగా.. ఆస్ట్రేలియా మోడి ఇన్నింగ్స్ లో 221 పరుగులు చేసింది. సఫారీలు రెండో ఇన్నింగ్స్ లో ఆరు వికెట్ల నష్టానికి 344 పరుగులు చేసి 612 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ముందు ఉంచింది సఫారీలు.. ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా ఓడిపోవడం అన్నది అసాధ్యమే..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here