బెడ్ మీద పడి ఉన్న శవం.. ముఖం మీద టార్చ్ వేయగా..!

బెడ్ మీద శవం పడి ఉంది. దగ్గరకు వెళ్ళిన పోలీసులు ముఖం మీదకు టార్చ్ వేసి చూడగా రక్తం కనిపించింది. ఇది ఎవరో కావాలనే పథకం ప్రకారం చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. జార్ఖండ్ రాష్ట్రం లోని బోకరే ప్రాంతంలో రియలెస్టేట్ వ్యాపారి అయిన పరితోష్ కుమార్ సింగ్ తన ఇంట్లో విగతజీవిగా మిగిలాడు.

పరితోష్ తన భార్య పిల్లలతో కలిసి సెక్టార్-2 లో ఉండేవాడు. భార్య పిల్లలతో కలసి పుట్టింటికి వెళ్ళడంతో పరితోష్ ఒక్కడే ఇంట్లో ఉన్నాడు. గత రెండేళ్ళుగా పరితోష్ రియలెస్టేట్ లో బాగా ఆర్జించడం మొదలుపెట్టాడు. తాజాగా అతడికి ఓ పెద్ద వెంచర్ ను అమ్మే అవకాశం వచ్చింది. యోగేష్ అనే వ్యక్తితో కలసి పరితోష్ ఆ డీల్ ను పూర్తీ చేయాలని అనుకున్నాడు. పొద్దుపోయే దాకా కూడా యోగేష్ తో కలసి హోటల్ లో ఉన్న పరితోష్ ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోయాడు. తాను ఇంటికి చేరినట్లు యోగేష్ కు ఫోన్ కూడా చేసి చెప్పాడు. ఏదో మాట్లాడాలని యోగేష్ రాత్రి 1 గంటల సమయంలో పరితోష్ కు ఫోన్ చేశాడు. అప్పుడు అతడి ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. నిద్రపోయి ఉంటాడేమో అందుకే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంటాడని యోగేష్ భావించాడు. ఆ తర్వాత రోజు ఉదయం కూడా పరితోష్ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో అతడి ఇంటి దగ్గరకు వెళ్ళాడు యోగేష్.

యోగేష్ ఇంటికి వెళ్ళి చూడగా పరితోష్ సోదరుడు ప్రదీప్ అప్పటికే అక్కడికి చేరుకున్నాడు. పరితోష్ కు తెలిసిన వ్యక్తులే లోపలి వచ్చి అతన్ని చంపేసి వెళ్ళిపోయారు. తలుపులు వేసుకోకపోవడంతో అనుమానం నిజమేనని అనిపిస్తోంది. పరితోష్ లోపల ఉండగా ఎవరో తలుపు తట్టారు. లోపల ఉన్న పరితోష్ తలుపు తీయగా.. లోనికి ప్రవేశించిన వాళ్ళు హత్య చేసి వెళ్ళిపోయారు. గదిలో మూడు కుర్చీలు కూడా పెట్టారు.. అంటే చంపేయడానికి ముందు ముగ్గురు వ్యక్తులు కలిసి మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై పోలీసులు విచారణ మొదలుపెట్టారు.

बेड पर ऐसे पड़ी मिली लाश, चेहरे पर जलाया टॉर्च तो सामने आई सच्चाई

बेड पर ऐसे पड़ी मिली लाश, चेहरे पर जलाया टॉर्च तो सामने आई सच्चाई

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here