వంద‌మంది ప్రభావ‌వంతుల జాబితాలో దీపికా

బాలీవుడ్ అగ్ర‌తార దీపికా పదుకోన్ జాబితాలోకి మరో ఘనత చేరింది…  ప్రపంచవ్యాప్తంగా 100 మందితో కూడిన ప్రభావ‌వంతుల జాబితాలో దీపికా చోటు దక్కించుకున్నారు. వెండితెరకు పరిచయమైన 11 ఏళ్ల తర్వాత ఈ ఘనతను సాధించడం గమనార్హం. 2007లో ఫర్హాఖాన్ దర్శకత్వం వహించిన ఓం శాంతి ఓం చిత్రంలో షారుక్ ఖాన్ పక్కన నటించడం ద్వారా బాలీవుడ్‌లోకి ప్రవేశించింది.

తొలి చిత్రమే బ్లాక్‌బస్టర్ కావడంతో దీపికా పదుకొన్‌కు ఎదురే లేకుండా పోయింది. అలాగే 2012లో దీపిక నటించిన కాక్‌టెయిల్ చిత్రం ద్వారా మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత చెన్నై ఎక్స్‌ప్రెస్, గోలియోంకి రాస్‌లీలా, పీకు, తమాషా, పద్మావత్ చిత్రాలతో అగ్రతారగాఎదిగింది. గతేడాది ట్రిపుల్ ఎక్స్‌: రిటర్న్ ఆఫ్ ఎక్సాండర్ కేజ్‌ చిత్రంతో హాలీవుడ్ లో అడుగుపెట్టింది. హాలీవుడ్ నటుడు విన్ డిజిల్ పక్కన నటించి మెప్పించింది.

ప్రస్తుతం అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్ల జాబితాలో దీపికా పేరు ప్రముఖంగా వినిపిస్తున్నది. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన పద్మావత్ చిత్రం కోసం దీపికా పదుకోన్ సుమారు రూ 12 కోట్ల పారితోషికాన్ని తీసుకొన్నట్టు సమాచారం. ఈ చిత్రంలో షాహిద్ కపూర్, రణ్‌వీర్ సింగ్‌ల సరసన దీపిక నటించిన విషయం తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here