దీపిక మెడకు గాయమయిందా.. లేక.. పాతజ్ఞాపకాన్ని చెరిపేసిందా..!

దీపిక పదుకోన్ నటించిన పద్మావతి చిత్రం ఎన్నో వివాదాలను సృష్టించింది. అడుగడుగునా అవాంతరాలు ఎదుర్కొని సినిమా రిలీజ్ అయింది. పద్మావతిగా నటించిన దీపికకు సినిమా విడుదలకు ముందు ఎంత మంది బెదిరించారో.. విడుదలయ్యాక అంతకు మించి పొగిడారు. అయితే ఇటీవల ఎయిర్ పోర్ట్ కు వచ్చిన దీపిక మెడకు ఓ బ్యాండేజ్ ఉండడాన్ని మీడియా గమనించింది.

ముంబై ఎయిర్ పోర్టు నుండి హైదరాబాద్ కు దీపిక వస్తున్న సందర్భంగా ఫోటోగ్రాఫర్స్ తీసిన చిత్రాలలో ఆమె మెడ భాగంపై ఓ పెద్ద బ్యాండేజ్ కనిపించింది. ఇదే ప్రదేశంలో ఆర్.కె. అనే టాటూ ఉంటుంది. చాకొలేట్ బాయ్ రణబీర్ కపూర్ తో కొంతకాలం ప్రేమాయణం జరిపింది. ఈ విషయాన్ని ఆమె దాచుకోలేదు కూడా. తన మెడపై ఆర్.కె. అనే అక్షరాలను టాటూ వేయించుకుంది. దాన్ని తొలగించుకోవడంలో భాగంగానే ఇలా బ్యాండేజ్ వేసుకోవాల్సి వచ్చిందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. స్కిన్ ఎలర్జీ కారణంగానే టాటూ వేసుకుందని మరికొందరు అంటూ ఉన్నారు. పాతగాయాన్ని చెరిపేసిందా.. లేక గాయమయింటే సర్జరీ చేసుకుందా అన్నది.. ఇంకా క్లారిటీ రాలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here