వ‌న్‌సైడ్ ల‌వ్‌! త‌న ప్రేమ‌ను అంగీక‌రించ‌లేద‌ని..!

కోలార్‌: ప‌్రేమ విఫ‌ల‌మైంద‌నే ఆవేద‌న‌తో ఓ యువ‌కుడు ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన ఘ‌ట‌న క‌ర్ణాట‌క‌లోని కోలార్ జిల్లాలో చోటు చేసుకుంది. మృతుడి పేరు న‌వీన్‌. జిల్లాలోని మాలూరు తాలూకా ప‌రిధిలోని కోరండ‌ళ్లి గ్రామ నివాసి. 20 సంవ‌త్స‌రాల న‌వీన్‌.. మాలూరు ప‌ట్ట‌ణంలోని ప్ర‌భుత్వ క‌ళాశాల‌లో డిగ్రీ చ‌దువుతున్నాడు. త‌న క్లాస్‌మేట్‌ను ప్రేమించాడు. అత‌నిది వ‌న్‌సైడ్ ల‌వ్‌.

ఏడాది కాలంగా ప్రేమిస్తోన్న విష‌యాన్ని ఇటీవ‌లే న‌వీన్ త‌న స్నేహితురాలికి వెలిబుచ్చాడు. అత‌ని ప్రేమ‌ను ఆమె నిరాక‌రించింది. దీనితో అత‌ను తీవ్ర మ‌న‌స్తాపానికి గుర‌య్యాడు. ముభావంగా ఉండేవాడ‌ని స్నేహితులు చెబుతున్నారు.

బుధ‌వారం ఇంట్లో ఎవ‌రూ లేని స‌మ‌యంలో ఉరి వేసుకుని బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డాడు. మృతుని త‌ల్లిదండ్రుల ఫిర్యాదు మేర‌కు మాలూరు పోలీసులు కేసు న‌మోదు చేసుకుని, ద‌ర్యాప్తు ఆరంభించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here