ఫేస్ బుక్ ఫ్రెండ్ ను పెళ్ళి చేసుకుంటానంటే తల్లిదండ్రులు ఒప్పుకోలేదు.. దీంతో అతడు..!

26 ఏళ్ల యువకుడు తన తల్లిదండ్రులను చంపడానికి ఏ మాత్రం వెనుకడుగు వేయలేదు. ఇంతకూ ఎందుకు అని అంటారా.. ఆ వ్యక్తి ఫేస్ బుక్ లో ఓ అమ్మాయిని ప్రేమించాడు.. ఆమెనే పెళ్ళి చేసుకోవాలని అనుకున్నాడు. కానీ అతడి తల్లిదండ్రులు ఇందుకు ఒప్పుకోలేదు. దీంతో వారిని ఈ లోకం లోనే లేకుండా చేశాడు. ఈ ఘటన భారత రాజధాని ఢిల్లీ లోని జామియా నగర్ లో చోటుచేసుకుంది.

ఒక్కగానొక్క కుమారుడు అయిన అబ్దుల్ రెహమాన్ తన తల్లిదండ్రులను ఆస్థి కోసం చంపేశాడు. మనుషులను పెట్టి మరీ అడ్డుతొలగించుకున్నాడు. అతడు కాన్పూర్ కు చెందిన యువతితో రిలేషన్ షిప్ లో ఉన్నాడు. రెండేళ్ళ క్రితం ఆమెతో ఫేస్ బుక్ లో పరిచయం ఏర్పడిందని పోలీసులు స్పష్టం చేశారు. రెహమాన్ గతంలో పెళ్ళి చేసుకుని భార్యకు విడాకులు ఇచ్చేశాడు. అయితే ఆ తర్వాత కాన్పూర్ కు చెందిన మహిళకు ఫ్రెండ్ అయ్యాడు. 2017 లో తల్లిదండ్రుల ఒత్తిడితో రెహమాన్ మరోసారి పెళ్ళి చేసుకున్నాడు. అయినప్పటికీ అతడు ఫేస్ బుక్ ఫ్రెండ్ తో తన రిలేషన్ షిప్ ను కొనసాగిస్తూ వచ్చాడు. ఆమెకు కూడా పెళ్ళి చేసుకుంటానని వాగ్ధానం చేశాడు. ఈ విషయాన్ని తల్లిదండ్రులతో చెప్పాడు. అయితే వాళ్ళు ఒప్పుకోలేదు.

దీంతో వారిని ఎలాగైనా అడ్డుతొలగించుకోవాలని చూశాడు. ఖాన్, గుడ్డు అనే వ్యక్తులను తన తల్లిదండ్రులను చంపేయమని కోరాడు. తనకు ఆస్థి రాగానే 2.5లక్షల రూపాయలు ఇస్తానని చెప్పాడు. ఓ రోజు వారు నిద్రపోతోంది గమనించిన రెహమాన్ ఖాన్, గుడ్డు లను పిలిపించాడు. వాళ్ళు వచ్చి దిండుతో గొంతును బిగబట్టి రెహమాన్ తల్లి తస్లీమ్ బానో(50), తండ్రి షమీమ్ అహ్మద్(55)లను చంపేశారు. ఏప్రిల్ 28న మొదటి అంతస్థులో వారి శవాలు కనిపించాయి. పోస్ట్ మార్టం నిర్వహించగా వారిని ఊపిరి ఆడకుండా చేసి చంపేశారని తేలింది. మే 21న రెహమాన్ ను పోలీసులు ఇన్వెస్టిగేట్ చేయగా చేసిన తప్పును ఒప్పుకున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here