అప్పటికే కదులుతున్న మెట్రో.. ట్రాక్ ను దాటాలని అనుకున్నాడు.. ఇంతలో ఏమి జరిగిందంటే..!

21 సంవత్సరాల వ్యక్తి మెట్రో ట్రాక్ దాటడానికి చేసిన పని అతడి ప్రాణాలకు ముప్పు వాటిల్లేలా చేసింది. అయితే అతడి అదృష్టం బాగుండడంతో ప్రాణాలు నిలబడ్డాయి. కదులుతున్న మెట్రో ట్రైన్ ముందు నుండి ట్రాక్ దాటాలని అనుకున్నాడు. కానీ అతడు అనుకున్న సమయంలో ప్లాట్ ఫామ్ మీదకు ఎక్కలేకపోయాడు. దీంతో అతన్ని చూసిన మెట్రో డ్రైవర్ క్షణాల్లో ట్రైన్ ను ఆపేసింది. దీంతో అతడు ట్రైన్ కింద నలిగిపోకుండా ప్రాణాలను నిలుపుకున్నాడు. ఈ ఘటన దేశ రాజధాని న్యూఢిల్లీ లోని శాస్త్రీ నగర్ మెట్రో స్టేషన్ లో చోటుచేసుకుంది.

మొత్తం ఘటన అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది. 21 సంవత్సరాల మయూర్ పటేల్ గా పోలీసులు గుర్తించారు. ఢిల్లీ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా.. తాను మెట్రో స్టేషన్ కు రావడం ఇదే మొదటిసారని.. అవతలి ప్లాట్ ఫామ్ కు ఎలా వెళ్ళాలో తెలీక ఈ పని చేశానని చెప్పుకొచ్చాడు. అతడికి 500 ఫైన్ లేదా ఆరునెలల జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. లేకపోతే రెండు శిక్షలూ విధించే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here