తిన్న‌దానికి డ‌బ్బులిమ్మ‌ని అడిగితే..ఉతికేశారు!

న్యూఢిల్లీ: దేశ రాజ‌ధానిలో దారుణ ఘ‌ట‌న చోటు చేసుకుంది. బిల్లు చెల్లించ‌మ‌ని అడిగిన రెస్టారెంట్ సిబ్బందిపై మూకుమ్మ‌డిగా దాడి చేశారు న‌లుగురు యువ‌కులు. కుర్చీలో కొట్టారు. న్యూఢిల్లీ పాండ‌వ్‌న‌గ‌ర్‌లోని ఓ రెస్టారెంట్‌లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. దాడి చేసిన దృశ్యాల‌న్నీ సీసీటీవీల్లో రికార్డ‌య్యింది. దీని ద్వారా పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

శ‌నివారం సాయంత్రం టిఫిన్ చేయ‌డానికి పాండ‌వ్‌న‌గ‌ర్‌లో ఉన్న గోపాల్ రెస్టారెంట్‌కు వెళ్లారు న‌లుగురు వ్య‌క్తులు. టిఫిన్ చేసిన అనంత‌రం రుచిగా లేదంటూ గొడ‌వ పెట్టుకున్నారు. బిల్లు ఇమ్మ‌ని అడిగిన రెస్టారెంట్ య‌జ‌మాని, ఉద్యోగిపై దాడి చేశారు.

కుర్చీల‌తో కొట్టారు. ఈ ఘ‌ట‌న‌లో రెస్టారెంట్ య‌జ‌మానిక గాయ‌ప‌డ్డారు. రెస్టారెంట్‌లో అమ‌ర్చిన సీసీటీవీలో ఇదంతా రికార్డ‌య్యింది. వెంట‌నే హోట‌ల్ యాజ‌మాన్యం పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here