ఆ దేశంలో బుర‌ఖా ధ‌రిస్తే.. అంతే సంగ‌తులు!

ముస్లింల మ‌త సంప్ర‌దాయం బుర‌ఖా ధ‌రించ‌డం ఆ దేశంలో నిషేధం. ముస్లిం మ‌హిళ‌లు బుర‌ఖా ధ‌రిస్తే.. జ‌రిమానా మామూలుగా ఉండ‌దు. భారీగా చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఆ దేశ‌మే కింగ్‌డ‌మ్ ఆఫ్ డెన్మార్క్‌. త‌మ దేశంలో ముస్లిం మ‌హిళ‌లు బుర‌ఖా ధ‌రించ‌డాన్ని నిషేధించామ‌ని సూచిస్తూ ఆ దేశ విదేశీ మంత్రిత్వ‌శాఖ అధికారులు ప్ర‌క‌టించారు.

ఈ మేర‌కు రాజ‌ధాని కోపెన్‌హెగ‌న్‌లో ఉన్న అన్ని దేశాల రాయ‌బార కార్యాల‌యాల‌కూ స‌మాచారాన్ని అంద‌జేశారు. ఇదే విష‌యాన్ని అన్ని దేశాల రాయ‌బార కార్యాల‌యాలు త‌మ దేశ ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేశాయి. డెన్మార్క్ వెళ్ల ద‌లిచిన‌, అక్క‌డ ఉండ‌ద‌లిచిన‌, ఇప్ప‌టికే నివాసం ఉంటోన్న ముస్లిం మ‌హిళ‌లు ఈ విష‌యాన్ని గుర్తుంచుకోవాల‌ని సూచించాయి. బుర‌ఖా ధ‌రించ‌డాన్ని నిషేధిస్తూ రూపొందించిన చ‌ట్టాన్ని డెన్మార్క్ పార్ల‌మెంట్ ఆమోదించింది.

ఈ ఏడాది ఆగ‌స్టు 1 నుంచి ఈ విధానం అమ‌ల్లోకి రానుంది. బుర‌ఖా ధ‌రించి మొద‌టిసారి ప‌ట్టుబ‌డితే డానిష్ క‌రెన్సీలో 1000 క్రోన్‌ల జ‌రిమానా విధిస్తారు. మొద‌టి మూడు త‌ప్పుల‌కు ఈ మొత్తం వ‌ర్తిస్తుంది. నాలుగోసారి ప‌ట్టుబ‌డితే ఈ మొత్తం 10000 క్రోన్‌ల జ‌రిమానా విధిస్తారు. ఒక్క డానిష్ క్రోన్ విలువ మ‌నదేశంలో 10 రూపాయ‌ల 55 పైస‌లు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here