కంప్లీట్‌ ఫన్‌ ఫిల్మ్‌ దేవదాస్ – నాగార్జున‌

కింగ్ నాగార్జున‌, నేచుర‌ల్ స్టార్ నాని క‌లిసి దేవ‌దాస్ అనే సినిమా చేస్తున్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఇందులో నాగ్ క్యారెక్ట‌ర్ పేరు దేవ్, నాని క్యారెక్ట‌ర్ పేరు దాస్. అయితే సినిమా ఏ కోవ‌కు చెందిన‌దో, క‌థ ఎలా ఉంటుంద‌నే విష‌యాల‌పై ఇప్ప‌టిదాకా పెద్ద‌గా చ‌ర్చ‌కు రాలేదు. అయితే తాజాగా నాగార్జున ఆ సినిమా విశేషాల‌ను వెల్ల‌డించారు.

https://twitter.com/iamnagarjuna/status/1014853472800288770

‘దేవదాస్‌’ ఆల్‌మోస్ట్‌ షూటింగ్‌ ఫినిష్‌ అయ్యింది. ఒక టెన్‌ డేస్‌ షూట్‌ బేలెన్స్‌ వుంది. నా క్యారెక్టర్‌ దేవ్‌. నాని క్యారెక్టర్‌ దాస్‌. కంప్లీట్‌ ఫన్‌ ఫిల్మ్‌ ఇది. లాటాఫ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ వుంటుంది. రాజు హిరాణి ఫిలింస్‌లో ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎలా వుంటుందో ‘దేవదాస్‌’లో అలా వుంటుంది. నానితో వర్క్‌ చేయడం చాలా హ్యాపీగా వుంది. వెరీ టాలెంటెడ్‌ యాక్టర్‌. ఈ సినిమా హిట్‌ అయితే మళ్ళీ సీక్వెల్‌ కూడా చేస్తామ‌ని తెలిపారు. దేవ‌దాస్ త‌రువాత తెలుగులో ఏ సినిమా రాబోతోంద‌ని ప్ర‌శ్నించ‌గా ‘బంగార్రాజు’ స్క్రిప్ట్‌ జరుగుతోంది. రైటర్‌ సత్యానంద్‌, దర్శకుడు కళ్యాణ్‌ కృష్ణ కథపై వర్క్‌ చేస్తున్నారు. అన్నపూర్ణ బేనర్‌లోనే ఈ సినిమా వుంటుందని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here