మ‌దీనా నుంచి బ‌య‌లుదేరిన విమానం..

సౌదీ అరేబియాలోని మ‌దీనా నుంచి బంగ్లాదేశ్ రాజ‌ధాని ఢాకాకు బ‌య‌లుదేరిన విమానం ప్ర‌మాదానికి గురైంది. ల్యాండింగ్ గేర్ నుంచి భారీ శ‌బ్దాలు వెలువడుతుండ‌టంతో విమానాన్ని జెడ్డాలోని కింగ్ అబ్దుల్ అజీజ్ విమానాశ్ర‌యంలో అత్య‌వ‌స‌రంగా ల్యాండింగ్ చేశారు. ఆ స‌మ‌యంలో విమానంలో 151 మంది ప్ర‌యాణికులు, సిబ్బంది ఉన్నారు.

సౌదీ అరేబియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఎయిర్‌బ‌స్ ఎ330-200 విమానం అది. సోమ‌వారం సాయంత్రం ముస్లింల ప‌విత్ర స్థ‌లం మ‌దీనా నుంచి ఢాకాకు 151 మంది ప్ర‌యాణికుల‌తో బ‌య‌లేదేరింది. మార్గ‌మ‌ధ్య‌లో విమానం గేర్‌బాక్స్‌లో నుంచి భారీ శ‌బ్దాలు వినిపిస్తుండ‌టం ఆరంభించాయి.

దీనితో ప్ర‌మాదాన్ని శంకించిన పైలెట్‌.. విమానాన్ని జెడ్డాలోని కింగ్ అబ్దుల్ అజీజ్ ఎయిర్‌పోర్ట్‌లో ఎమ‌ర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ల్యాండింగ్ చేయ‌డానికి జెడ్డా ఎయిర్‌ట్రాఫిక్ కంట్రోల్ విభాగం నుంచి స‌రైన స‌మ‌యంలో స్పంద‌న రాలేదు. దీనితో ఈ విమానం సుమారు రెండున్నర గంట‌ల పాటు గాల్లోనే చ‌క్క‌ర్లు కొట్టింది.

రాత్రి 10 గంట‌ల స‌మ‌యంలో ఈ విమానానికి సిగ్న‌ల్ ఇచ్చారు అధికారులు. విమానం ల్యాండ్ అయిన వెంట‌నే ఇంజిన్ నుంచి స్వ‌ల్పంగా మంట‌లు చెల‌రేగాయి. అత్య‌వ‌స‌ర ద్వారం నుంచి ప్ర‌యాణికుల‌ను కిందికి దించారు. ప్ర‌యాణికులెవ‌రూ గాయ‌ప‌డ‌లేద‌ని సౌదీ అరేబియా ఎయిర్‌లైన్స్ యాజ‌మాన్యం వెల్ల‌డించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here