ఇప్పటిదాకా చూడని ఖనిజం ఆ వజ్రంలో ఉంది.. కిలోమీటర్ లోతు తవ్వి తీశారు..!

ఈ భూగ్రహంలో మనకు తెలియని ఎన్నో నిగూఢమైన రహస్యాలు దాగున్నాయన్నది అందరికీ తెలిసిందే. భూమికి 400 మైళ్ళ లోపు త్రవ్వితే కానీ దొరకని ఓ ఖనిజం వజ్రంలో దొరికింది. అది కూడా ఆ వజ్రాన్ని ఒక కిలోమీటర్ లోతులోనే దొరికిన వజ్రంలో కనిపించింది.

సౌత్ ఆఫ్రికా లోని కుల్లాన్ మైన్స్ లో త్రవ్వకాలు జరిపినప్పుడు ఈ వజ్రం బయటపడింది. ఈ మైన్స్ లోనే ప్రపంచం లో ఎన్నో ప్రసిద్ధి చెందిన వజ్రాలు బయటపడ్డాయి. ఈ వజ్రంలో క్యాల్షియం సిలికేట్ పెరోవ్స్కైట్ అనే ఖనిజం లభించింది. ఈ ఖనిజం భూమి లోపల 400 మైళ్ళు వెళితే కానీ దొరకదట. ఈ డైమండ్స్ బ్రిటీష్ క్రౌన్ జ్యువెలరీలో ఉన్నాయి. చాలా ఏళ్లుగా చెప్పుకుంటున్నట్లు భూమి లోపల ఉన్న పొరలు కదులుతూ ఉంటాయన్నది నిజమైందని ఈ డైమండ్ నిరూపించిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందుకే ఎక్కడో వందల మైళ్ళ లోపల ఉన్న ఖనిజం బయటకు వచ్చింది. ఈ ఖనిజం బయటపడడం నిజంగా సరికొత్త ప్రయోగాలకు నాంది పలకనుందని తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here