పెట్రోల్‌, డీజిల్ రేట్స్‌..ఆల్ టైమ్ రికార్డ్‌!

న్యూఢిల్లీ: కేంద్రంలో న‌రేంద్ర‌మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్ర‌భుత్వం ఏర్ప‌డిన తొలి రోజుల్లో పెట్రో రేట్లు కాస్త త‌గ్గుముఖం ప‌ట్టాయి. వాహ‌న‌దారులు ఆనందం వ్య‌క్తం చేశారు. ఆ ఆనందం ఎంతో కాలం నిల‌వ‌నివ్వ‌లేదు. పెట్రోలు, డీజిల్ రేట్లు అసాధార‌ణ రీతిలో పెరిగాయి. ఈ నాలుగేళ్లలో గ‌రిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. తాజాగా ఆదివారం నాటికి పీక్స్‌కు చేరుకున్నాయి వాటి రేట్లు.

డీజిల్ ధ‌ర లీట‌ర్ ఒక్కింటికి హైదరాబాద్‌లో 69.74 రూపాయ‌ల‌కు చేరుకుంది. ఈ స్థాయిలో డీజిల్ ధ‌ర‌లు గ‌తంలో ఎప్పుడూ లేవు. పెట్రోల్ ధర 77.69 రూపాయ‌ల‌కు చేరింది. 2014 సెప్టెంబర్ 14వ తేదీన పెట్రోలు ధ‌ర 73.73 రూపాయ‌లుగా ఉన్న‌ది. ఇప్పుడా రికార్డును బ్రేక్ చేశాయి తాజా ధ‌ర‌లు.

ఒక‌వైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు త‌గ్గుముఖం ప‌డుతున్న‌ప్ప‌టికీ.. అటు కేంద్రం గానీ, ఇటు చ‌మురు సంస్థ‌లు గానీ పెట్రో ఉత్ప‌త్తుల రేట్ల‌ను నియంత్రించ‌డంలో ఘోరంగా విఫ‌ల‌మ‌య్యాయ‌నే విమ‌ర్శ‌లు అప్పుడే మొద‌ల‌య్యాయి కూడా. పెట్రో ఉత్ప‌త్తుల‌ను జీఎస్టీ ప‌రిధిలోకి ఎందుకు తీసుకుని రాలేదంటూ నిల‌దీస్తున్నారు నెటిజన్లు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here