దినేష్ కార్తీక్ జీవితంలో చోటుచేసుకున్న అనుకోని ఘటనలు..!

ఒకే ఒక్క ఇన్నింగ్స్ తో దినేష్ కార్తీక్ భారత్, శ్రీలంక క్రికెట్ అభిమానులకు దేవుడై పోయాడు. బంగ్లాదేశ్ ఆటగాళ్ళు చేసిన ఓవర్ యాక్షన్ ను మనసులో పెట్టుకున్న శ్రీలంక అభిమానులు.. నిదహాస్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో భారత్ కే ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. మన ఆటగాళ్ళు కొట్టే ప్రతి ఒక్క బౌండరీకి శ్రీలంక అభిమానులు స్టేడియాన్ని హోరెత్తించారు. ఇక భారత్ ఓడిపోతుందన్న సమయంలో దినేష్ కార్తీక్ వచ్చి మరపురాని విజయాన్ని అందించాడు. లాస్ట్ బాల్ ఫినిషింగ్ ఇచ్చిన దినేష్ కార్తీక్ గురించి సోషల్ మీడియాలో అభిమానులు తెగ చర్చించుకుంటూ ఉన్నారు. దినేష్ పర్సనల్ లైఫ్ లో చోటుచేసుకున్న చాలా విషయాలు బయటకు రాలేదు. అందులో ముఖ్యంగా అతడి వైవాహిక జీవితం.

ఈ ఏడాది దక్షిణాఫ్రికా సిరీస్ కు భారతజట్టు వెళ్ళినప్పుడు మురళీ విజయ్ కూడా వెళ్ళాడు. ఇక సాహాకు గాయం అవ్వగానే దినేష్ కార్తీక్ ను హుటాహుటిన రమ్మని పిలిచారు. అయితే దినేష్ కార్తీక్ కూ, మురళీ విజయ్ మధ్య సత్సంబంధాలు లేవు.. దీని మీద అప్పట్లో చర్చలు కూడా జరిగాయి. ఇంతకూ వీరి మధ్య ఏమి జరిగిందనేది చాలా మందికి క్లారిటీ లేదు.. అందుకు ముఖ్య కారణం దినేష్ కార్తీక్ భార్య..

2012 వరకూ దినేష్ కార్తీక్ తన భార్య నికితతో కలిసి ఉన్నాడు. ఇద్దరూ ఐపీఎల్-5లో కలిసి కనిపించారు కూడా.. ఆ సమయంలోనే మురళీ విజయ్ తో దినేష్ కార్తీక్ భార్యకు పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వీరిద్దరి మధ్య అఫైర్ ఏర్పడింది. ఇద్దరూ కలుసుకోవడం కూడా మొదలైంది. వాళ్ళ మధ్య జరుగుతున్న విషయం దినేష్ కార్తీక్ కు కూడా తెలిసింది. దీంతో కలిసి ఉండడం కంటే విడిపోవడమే మేలు అని అనుకున్నారు. అలా ఇద్దరూ విడిపోయారు. రిపోర్టుల ప్రకారం విడిపోయే ముందు నికిత గర్భవతి అట.. విడాకులు తీసుకోగానే నికిత మురళీ విజయ్ ను పెళ్ళి చేసుకుంది.

ఇప్పుడు మురళీ విజయ్, నికితలకు ముగ్గురు పిల్లలు. ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి. దినేష్ కార్తీక్ తన భార్య నికితతో అయిదేళ్ళు కలిసి ఉన్నాడు. 2007 నుండి 2012 వరకు. ఇక 2015 ఆగస్ట్ లో భారత స్క్వాష్ ప్లేయర్ దీపిక పల్లికల్ ను దినేష్ కార్తీక్ పెళ్ళి చేసుకున్నాడు. నిదహాస్ ట్రోఫీ ఫైనల్ లో భారత్ గెలిచినప్పుడు కూడా మురళి విజయ్ కనీసం దినేష్ కార్తీక్ పేరును ప్రస్తావించలేదు. కావాలంటే అతడి ట్వీట్ చూడండి..

https://twitter.com/mvj888/status/975418962094600194

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here