దినేష్ కార్తీక్ మాజీ భార్యను మురళీ విజయ్ పెళ్ళి చేసుకున్నాడు.. కొన్నేళ్ళుగా మాటలు లేవు..!

ఈ ఏడాది దక్షిణాఫ్రికా సిరీస్ కు భారతజట్టు వెళ్ళినప్పుడు మురళీ విజయ్ కూడా వెళ్ళాడు. ఇక సాహాకు గాయం అవ్వగానే దినేష్ కార్తీక్ ను హుటాహుటిన రమ్మని పిలిచారు. అయితే దినేష్ కార్తీక్ కూ, మురళీ విజయ్ మధ్య సత్సంబంధాలు లేవు.. దీని మీద అప్పట్లో చర్చలు కూడా జరిగాయి. ఇంతకూ వీరి మధ్య ఏమి జరిగిందనేది చాలా మందికి క్లారిటీ లేదు.. అందుకు ముఖ్య కారణం దినేష్ కార్తీక్ భార్య..

2012 వరకూ దినేష్ కార్తీక్ తన భార్య నికితతో కలిసి ఉన్నాడు. ఇద్దరూ ఐపీఎల్-5లో కలిసి కనిపించారు కూడా.. ఆ సమయంలోనే మురళీ విజయ్ తో దినేష్ కార్తీక్ భార్యకు పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వీరిద్దరి మధ్య అఫైర్ ఏర్పడింది. ఇద్దరూ కలుసుకోవడం కూడా మొదలైంది. వాళ్ళ మధ్య జరుగుతున్న విషయం దినేష్ కార్తీక్ కు కూడా తెలిసింది. దీంతో కలిసి ఉండడం కంటే విడిపోవడమే మేలు అని అనుకున్నారు. అలా ఇద్దరూ విడిపోయారు. రిపోర్టుల ప్రకారం విడిపోయే ముందు నికిత గర్భవతి అట.. విడాకులు తీసుకోగానే నికిత మురళీ విజయ్ ను పెళ్ళి చేసుకుంది.

ఇప్పుడు మురళీ విజయ్, నికితలకు ముగ్గురు పిల్లలు. ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి. దినేష్ కార్తీక్ తన భార్య నికితతో అయిదేళ్ళు కలిసి ఉన్నాడు. 2007 నుండి 2012 వరకు. ఇక 2015 ఆగస్ట్ లో భారత స్క్వాష్ ప్లేయర్ దీపిక పల్లికల్ ను దినేష్ కార్తీక్ పెళ్ళి చేసుకున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here