సీత‌మ్మ త‌ల్లి టెస్ట్‌ట్యూబ్ బేబీ కాక‌పోతే మ‌రేమిటి!

స‌రిగ్గా 24 గంట‌ల కింద‌ట మ‌హాభార‌తంపై ఓ వివాదాస్ప‌ద కామెంట్స్ చేశారు ఉత్త‌ర్‌ప్ర‌దేశ్ ఉప ముఖ్య‌మంత్రి దినేష్ శ‌ర్మ‌. జ‌ర్న‌లిజం అనేది మ‌హాభార‌త కాలం నుంచే ఉంద‌ని చెప్పారు. లైవ్ టెలికాస్ట్‌లు ఉన్నాయ‌ని సెల‌విచ్చారు. ఇప్ప‌టి గూగుల్ సెర్చ్ ఇంజిన్‌ను నార‌ద మ‌హామునితో పోల్చారు.

నారదుడు, గూగుల్ ఒక్క‌టి కాక‌పోతే మ‌రేమిటీ.. అంటూ రాగాలు తీశారు. స‌రిగ్గా 24 గంట‌ల త‌రువాత అదే దినేష్ శ‌ర్మ ఈ సారి రామాయ‌ణంపై కామెంట్స్ చేశారు. ఏకంగా సీత‌మ్మ త‌ల్లినే టార్గెట్ చేశారు. సీత‌మ్మ త‌ల్లి టెస్ట్‌ట్యూబ్ బేబీ అని వ్యాఖ్యానించారు. సీత‌మ్మ త‌ల్లి మ‌ట్టికుండ‌లో జ‌న్మించ‌డ‌మే దీనికి నిద‌ర్శ‌న‌మ‌ని దినేష్ శ‌ర్మ అన్నారు.

 

`జ‌న‌క మ‌హారాజు పొలం దున్నుతుంటే- నాగ‌లికి త‌గిలి ఓ మ‌ట్టికుండా భూమి నుంచి బ‌య‌టికి వ‌చ్చింది. ఆ మ‌ట్టికుండ‌లో ఉన్న చిన్నారే సీత‌మ్మ త‌ల్లి. మ‌రి సీతమ్మ త‌ల్లి టెస్ట్‌ట్యూబ్ బేబీ కాక‌పోతే మ‌రేమిటి. రామాయ‌ణ కాలం నుంచే టెస్ట్‌ట్యూబ్ బేబీలు ఉన్నారు..` అని ఆయ‌న అన్నారు.

రామయణ కాలంలోనే టెస్ట్‌ ట్యూబ్‌ బేబీల ప్ర‌క్రియ మొదలైంద‌ని అన్నారు. హిందీ పాత్రికేయుల దినోత్సవం సందర్భంగా ఓ కార్యక్రమానికి హాజరైన శర్మ నూతన ఆవిష్కరణలను పురాతన భారత్‌తో పోల్చుతూ లైవ్‌ టెలికాస్ట్‌ మహాభారత కాలంలో ఉందని పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here