ఆయ‌న‌పై కొర‌టాల శివ అద్భ‌తమైన కామెంట్‌! రోమాలు నిక్క‌బొడుచుకునే ట్వీట్‌!

హైద‌రాబాద్‌: కొర‌టాల శివ‌. తీసింది నాలుగే నాలుగు సినిమాలు. ఆ నాలుగూ ఇండ‌స్ట్రీ హిట్లే. బ్లాక్ బ‌స్ట‌ర్లే. రికార్డుల‌ను కొల్ల‌గొట్టిన‌వే. బాక్సాఫీసును షేక్ చేసిన‌వే. అలాగ‌ని అవేవీ ప‌క్కా మాస్ మ‌సాలా, క‌మ‌ర్షియ‌ల్ మూవీలు కావు. సామాజిక సందేశాన్ని ఇచ్చే చిత్రాలు.

తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో.. అదీ ఓ క‌మ‌ర్షియ‌ల్ హీరోల‌ను పెట్టి.. సామాజిక సందేశాల‌ను ఇవ్వ‌డం అంటే అసాధ్యం. అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి, చూపించాడు కొర‌టాల శివ‌. కొర‌టాల శివ అనగానే.. మ‌న‌కు వామ‌ప‌క్ష కురువృద్ధుడు కొర‌టాల స‌త్య‌నారాయ‌ణ గుర్తుకు వ‌స్తారు.

 

నిజ‌మే- ఆయ‌న వార‌సుడే కొర‌టాల శివ‌. అందుకే- ఆయ‌న సినిమాల్లో సామాజిక సందేశాలు ఉట్టి ప‌డుతుంటాయి. అలాంటి కొర‌టాల శివ‌.. శ్రీ‌శ్రీ‌పై అద్భుత‌మైన కామెంట్ చేశారు. శ్రీ‌శ్రీ జ‌యంతి సంద‌ర్భంగా వాట‌ర్ క‌ల‌ర్‌తో వేసిన ఓ పెయింట్‌ను పోస్ట్ చేశారు.

కాల‌ర్ ఎగ‌రేస్తోన్న శ్రీ‌శ్రీ పిక్‌ను ట్వీట్ చేశారు. దానికి త‌న కామెంట్‌ను జోడించారు. `అక్షరానికున్న బలాన్ని అవగతం చేసి, అభ్యుదయాన్ని నా రక్తగతం చేసిన ఆజన్మ స్ఫూర్తి శ్రీ శ్రీ గారికి జయంతి నమస్సులు..అంటూ ట్వీట్ చేశారు కొర‌టాల‌. ఈ ట్వీట్ శ్రీ‌శ్రీ‌పై ఆయ‌న‌కు ఉన్న గౌర‌వాన్ని, భ‌క్తిని చాటుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here