`ప‌వ‌న్ బాధ‌ప‌డ‌టం చూడ‌లేక‌పోతున్నా.. ఆర్జీవీ చేసిన ప‌ని న‌చ్చ‌లేదు..`

హైద‌రాబాద్‌: కాస్టింగ్ కౌచ్ వ్య‌వ‌హారంలో శ్రీ‌రెడ్డిని తానే ప్రోత్స‌హించాన‌ని, ప‌వ‌న్ క‌ల్యాణ్ పేరును ప్ర‌స్తావించాల‌ని కూడా తానే చెప్పానంటూ ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ ఇచ్చిన స్టేట్‌మెంట్ తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో కాక పుట్టించింది. శ్రీ‌రెడ్డి వ్య‌వ‌హారం మొత్తానికీ రామ్‌గోపాల్ కార‌కుడు కావ‌డంతో ఫిల్మ్ ఇండ‌స్ట్రీ ఆయ‌న‌పై భ‌గ్గుమంటోంది.

రామ్‌గోపాల్ వ‌ర్మ‌ను దైవంగా భావించే.. ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్ కూడా ఈ విష‌యంలో కొణిదెల కుటుంబానికే మ‌ద్ద‌తు ఇచ్చారు. `నాకు జీవితాన్ని ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు బాధపడటం నాకు చాలా బాధ కలిగించింది. అతనిని ఎప్పుడూ ఇలా చూడలేదు. ఆర్జీవీ చేసిన పని నాకు నచ్చలేదు . ప్రాణం ఉన్నంత వరకూ ఐ స‌పోర్ట్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌..`అంటూ ట్వీట్ చేశారు పూరీ జ‌గ‌న్నాథ్‌.

మ‌రోవైపు- ప‌చ్చ చానెళ్ల వ్య‌వ‌హారంపై ప‌వ‌న్ క‌ల్యాణ్‌, నాగ‌బాబు, అల్లు అర్జున్ త‌దిత‌ర సినీ ప్ర‌ముఖులు `మా` కార్యాల‌యం ముందు ఆందోళ‌న‌కు దిగారు. ఈ కార్య‌క్ర‌మానికి పెద్ద ఎత్తున న‌టీన‌టులు త‌ర‌లివ‌చ్చారు. దీనితో మా కార్యాల‌యం మొత్తం నిర‌స‌న ధ్వ‌నుల‌తో మారుమోగుతోంది. ప‌చ్చ ఛానెళ్ల‌కు వ్య‌తిరేకంగా న‌టులు నినాదాలు ఇస్తున్నారు.

రామ్‌గోపాల్ వ‌ర్మ‌పై చ‌ర్య‌లు తీసుకోక‌పోతే.. తానే స్వ‌యంగా రంగంలోకి దిగుతానంటూ ప‌వ‌న్ క‌ల్యాణ్ హెచ్చ‌రించారు. రామ్‌గోపాల్ వర్మపై క్రిమినల్ చర్యలతోపాటు సినీ ఇండస్ట్రీ నుంచి ఎలాంటి యాక్షన్ తీసుకోవాలనే విషయాన్ని బహిరంగంగా ప్రకటించాలని అన్నారు. అప్పటి వరకు ఫిల్మ్ చాంబర్ వీడేది లేదని తెగేసి చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here