దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి ట్వీట్ చేసిన ఫొటో ఇది..దీని ప్ర‌త్యేక‌త ఏంటో తెలుసా?

హైద‌రాబాద్‌: అల్లాట‌ప్పా ఫొటో కాదిది. దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు ఎస్ఎస్ రాజ‌మౌళి దీన్ని ట్వీట్ చేశారంటే.. దానికున్న ప్రాధాన్య‌త ఏంటో అర్థం చేసుకోవ‌చ్చు. ఇదో చౌక్‌. జంక్ష‌న్‌లాంటిద‌న్న‌మాట‌. పాకిస్తాన్‌లోని లాహోర్‌లో ఉందీ చౌక్‌. దీని పేరు షాద్మ‌న్ చౌక్‌. దీన్నే రాజ‌మౌళి ఎందుకు ట్వీట్ చేయాల్సి వ‌చ్చిందంటే..ఇక్క‌డే- భ‌గ‌త్‌సింగ్‌ను ఉరి తీశారు.

భార‌త స్వాతంత్ర్య సంగ్రామ స‌మ‌యంలో బ్రిటీష‌ర్లు.. ఈ షాద్మ‌న్ చౌక్‌లోనే భ‌గ‌త్‌సింగ్‌ను ఉరి తీశారు. అప్ప‌ట్లో పాకిస్తాన్ ఆవిర్భ‌వించ‌లేదు. లాహోర్ కూడా అవిభాజ్య భార‌త్‌లోనే ఉండేది. మొన్నీమ‌ధ్యే పాకిస్తాన్ అంత‌ర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో పాల్గొన‌డానికి రాజ‌మౌళి పాకిస్తాన్ వెళ్లారు.

క‌రాచీలో ఈ ఫెస్టివ‌ల్ నాలుగురోజుల పాటు జ‌రిగింది. ఆయ‌న క‌రాచీతో పాటు లాహోర్‌, ఇస్లామాబాద్‌ల‌ల్లో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా షాద్మ‌న్ చౌక్‌ను ఫొటో తీశారు. ఈ చౌక్‌కు ఉన్న ప్రాధాన్య‌త‌ను వివ‌రించేలా ఎలాంటి ఆన‌వాళ్లు కూడా లేవ‌ని రాజ‌మౌళి చెప్పుకొచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here