అమ్మ బ్ర‌హ్మ‌దేవుడో..కొంప‌ముంచినావురో!

ముంబై: `అమ్మ బ్ర‌హ్మ‌దేవుడో..కొంపముంచినావురో..` అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి మ‌ర‌ణించింద‌నే విష‌యం తెలుసుకున్న త‌రువాత ఆమె అభిమానుల ఆవేద‌న సింపుల్‌గా చెప్పాలంటే ఇంతే.

ఆమె సినిమాల్లో న‌టించ‌క‌పోయినప్ప‌టికీ.. ఇప్పటికీ..ఎప్ప‌టికీ ఆమె త‌మ అతిలోక సుంద‌రేనంటూ ఆనందించే అభిమానుల గుండె ప‌గిలిన‌ట్ట‌యింది. శ్రీ‌దేవికి వీరాభిమాని రామ్‌గోపాల్ వ‌ర్మ‌.

శ్రీ‌దేవి లేర‌నే విష‌యాన్ని తెలిసిన‌ప్ప‌టి నుంచి ఆయ‌న ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తూ పోతున్నారు. శ్రీ‌దేవిని బ్రూస్‌లీతో పోల్చారు. బ్రూస్‌లీని, శ్రీ‌దేవిని ఎందుకంత త్వ‌ర‌గా తీసుకెళ్లారంటూ ప్ర‌శ్నిస్తున్నారు.

గోవిందా..గోవింద సినిమా షూటింగ్ సంద‌ర్భంగా శ్రీ‌దేవితో క‌లిసి దిగిన ఫొటోల‌ను రామ్‌గోపాల్ వ‌ర్మ షేర్ చేశారు. ఓ ట్వీట్‌లో ఆయ‌న ఏకంగా ఆ గోవిందుడినే నిల‌దీశారు కూడా.

`ఏయ్ బాలాజీ! న‌న్నిక్క‌డ ఒంట‌రిగా వ‌దిలి..శ్రీ‌దేవిని ఎందుకు తీసుకెళ్లావు..` అంటూ ప్ర‌శ్నించారు. నాగార్జునతో తాను తీస్తోన్న సినిమా టైటిల్‌, ఫ‌స్ట్‌లుక్‌, విడుద‌ల తేదీని వాయిదా వేసిన‌ట్లు చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here