జ‌పాన్ స‌ముద్రంలో పోగొట్టుకున్న కెమెరా..రెండున్న‌రేళ్ల త‌రువాత తైవాన్‌లో దొరికింది!

తైపీ: ఈ ఫొటోలో క‌నిపిస్తోన్న‌ది ఓ కెమెరా. స్కూబా డైవ‌ర్లు వినియోగించేది. జపాన్‌లోని ఒకినావా స‌మీపంలో స‌ముద్ర గ‌ర్భంలో అన్వేష‌ణ‌కు వెళ్లిన సంద‌ర్భంలో సెరినా సుబాకిహ‌ర అనే ఓ మ‌హిళా స్కూబా డైవ‌ర్ చేతిలోంచి జారి ప‌డింది. ఆ త‌రువాత ఆమె ఎంత వెదికినా ఆ క్యాన‌న్ జీ 12 మోడ‌ల్ కెమెరా ఆమెకు క‌నిపించ‌లేదు. దానిపై ఆశ‌లు వ‌దిలేసుకుని ఒడ్డుకు చేరింది.

2015 సెప్టెంబ‌ర్‌లో ఈ సంఘ‌ట‌న చోటు చేసుకుంది. దాదాపు రెండున్న‌రేళ్ల త‌రువాత అదే కెమెరా తైవాన్‌లోని సావో వ‌ద్ద ఒడ్డుకు కొట్టుకొచ్చింది. స్కూల్ ట్రిప్ కోసం సావో తీరానికి వెళ్లిన మౌంట్ ఎలిమెంట‌రీ స్కూల్ విద్యార్థుల చేతికి చికిందా కెమెరా.

స్కూబా డైవ‌ర్లు వినియోగించే కెమెరాలంటే కాస్త దిట్టంగానే ఉంటాయ‌వి. ఆ కెమెరాకు వాట‌ర్ ప్రూఫ్ కేసింగ్‌ను అమ‌ర్చారు. దానివ‌ల్ల అన్నేళ్ల‌యిన‌ప్ప‌టికీ.. ఆ కెమెరా చెక్కు చెద‌ర‌లేదు. కాక‌పోతే- విచిత్రంగా త‌యారైంది. నాచు ప‌ట్టి, గ‌వ్వ‌లు అతుక్కుపోయి క‌నిపించింది.

అదేదో విచిత్రంగా ఉండ‌టంతో విద్యార్థులు దాన్ని త‌మ టీచ‌ర్ పార్క్ లీ చేతికి అందించారు. దీన్ని ఫొటోలు తీసిన పార్క్ లీ త‌న ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. అది కాస్తా సుబాకిహ‌ర కంట్లో ప‌డింది. వెంట‌నే ఆమె పార్క్ లీని సంప్ర‌దించ‌డంతో అస‌లు విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. దీనికి సంబంధించిన ఓ చిన్న క‌థ‌నాన్ని పార్క్ లీ త‌న ఫేస్‌బుక్‌లో రాసుకొచ్చారు.

(ఫొటోలు: పార్క్ లీ ఫేస్‌బుక్/మెయిల్ ఆన్‌లైన్)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here