స‌ర‌దాగా స‌ముద్రంలో డైవ్ చేశారు! భూమండ‌లంలోనే అతి పెద్ద గుహ‌ను క‌నుగొన్నారు! అంతెక్క‌డో మ‌రి

గుహ అనేది భూమ్మీద మాత్ర‌మే ఉంటుంద‌ని మ‌న‌కు తెలుసు. మెక్సికో తీర ప్రాంతంలో స‌ముద్ర గ‌ర్భంలో కొత్త‌గా వెలుగులోకి వ‌చ్చిన ఓ గుహ.. మ‌న అంచ‌నాల‌ను త‌ల‌కిందులు చేసేసింది.

స‌ముద్ర‌గ‌ర్భంలో పే..ద్ద గుహ‌. ఎంత పెద్ద‌దంటే.. దాని పొడ‌వు 350 కిలోమీట‌ర్ల పైమాటే. ఇంత పెద్ద గుహ భూమండ‌లంలోనే లేదు. మెక్సికో తూర్పు తీరంలో కొంత‌మంది డైవ‌ర్లు ఈ గుహ‌ను క‌నుగొన్నారు.

క‌నుగొన్నారంటే వారేదో ప‌రిశోధ‌న‌లు చేసి కాదు. సరదాగా స‌ముద్రంలో డైవింగ్‌కి దిగారు. స‌ముద్ర గ‌ర్భంలోని అందాల‌ను తిల‌కిస్తూ వెళ్తుండ‌గా.. ఈ గుహ కనిపించింది.

ఆటుపోట్ల వ‌ల్ల ఆ గుహ పైభాగం వారిని ఆక‌ర్షించింది. దీన్ని చూసి..లోప‌లికి వెళ్లిన వారు ఆశ్చ‌ర్యానికి గుర‌య్యారు. టార్చిలైట్ వేసుకుంటూ ఎంత దూరం వెళ్లిన‌ప్ప‌టికీ.. దాని అంతు క‌నుక్కోలేక‌పోయారు. వెన‌క్కి వ‌చ్చేశారు.

బ‌య‌టికి వ‌చ్చిన త‌రువాత సోనార్, ఇత‌ర ప‌రిక‌రాల ద్వారా ప‌రిశోధ‌న చేశారు. ఆ గుహ పొడ‌వు ఎంత లేద‌న్నా 350 కిలోమీట‌ర్లకు పైగానే ఉంటుంద‌ని అంచ‌నా వేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here