చైతూ, స‌మంత‌ల మ‌ధ్య దివ్యాంశ‌

తెలుగు సినిమా రేంజ్ నేడు బాలీవుడ్ సినిమాల‌ను చేరింది. ఇక్క‌డ క్వాలిటీ సినిమాలు రూపొందుతున్నాయి. అందుక‌నే బాలీవుడ్ న‌టీన‌టులు కూడా ద‌క్షిణాదిన.. ముఖ్యంగా తెలుగులో న‌టించ‌డానికి ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నారు. అలా ఆస‌క్తితో బాలీవుడ్ లో ప‌లు సీరియ‌ల్స్, యాడ్స్ లో న‌టించిన మోడ‌ల్ దివ్యాంశ కౌశిక్ తెలుగులో త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకోనుంది. వివ‌రాల్లోకి వెళ్తే… స‌మంత‌, నాగ చైత‌న్య జంట పెళ్ళి అయిన త‌రువాత తొలిసారిగా ఓ సినిమాలో న‌టించ‌నున్న సంగ‌తి తెలిసిందే. నిన్ను కోరి ఫేమ్ శివ నిర్వాణ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. పెళ్ళైన ఓ జంట మ‌ధ్య‌లో మ‌రో స్త్రీ వ‌స్తే ఎలాంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌నే కాన్సెప్ట్ తో ఈ సినిమా రూపొంద‌నుంద‌ని స‌మాచారం. చైతు, సమంత భార్యా భ‌ర్త‌లుగా న‌టిస్తుంటే… వారి జీవితంలోకి ప్ర‌వేశించే అమ్మాయి పాత్ర‌లో దివ్యాంశ కౌశిక్ క‌నిపించ‌నుంద‌న్న‌మాట‌.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here