ఆసిఫా కేసులో డీఎన్ఏ రిపోర్ట్ లు వచ్చేశాయి..!

కథువా రేప్ కేసు.. చిన్నారి ఆసిఫాను అన్యాయంగా అత్యాచారం చేసి చంపేశారు. వారిని ఉరి తీయాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా నిందితులకు సంబంధించిన అన్ని విషయాలలోనూ విచారణ చేస్తున్నారు. తాజాగా ఆసిఫా కేసుకు సంబంధించి డీఎన్ఏ రిపోర్టులు వెల్లడయ్యాయి.

ఢిల్లీకి చెందిన ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ 14 పరీక్షలను నిర్వహించింది. వెజైనల్ స్వాబ్స్, హెయిర్ స్ట్రాండ్స్, నలుగురు నిందితుల బ్లడ్ శ్యాంపిళ్లతో పాటు మృతురాలి విసెరా, బాలిక ఫ్రాక్, సల్వార్, అక్కడున్న మట్టి, రక్తపు మరకలను ఫోరెన్సిక్ అధికారులు పరీక్షించారు. శ్యాంపిళ్లను పరీక్షించిన తరువాత నిందితులే బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డట్టు ల్యాబ్ తేల్చింది. యోని ద్రవాలపై నిర్వహించిన పరీక్షలో డీఎన్ఏ శాంపిళ్లు కూడా మ్యాచ్ అయినట్టు రిపోర్ట్ వెల్లడించింది. ఈ నివేదికను జమ్మూకశ్మీర్ క్రైం పోలీసులకు అందజేసినట్లు ల్యాబ్ తెలిపింది. అయితే నిందితులు కొద్ది రోజుల క్రితం తాము ఏ తప్పూ చేయడం లేదని నార్కో టెస్టులు చేయడానికి కూడా తాము సిద్ధమేనని చెప్పుకొచ్చారు. అయితే ఇవంతా కేసును తప్పుదారి పట్టించడానికేనని అర్థం అవుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here