మరోసారి పెళ్ళి చేసుకోనున్న విరాట్, అనుష్క.. ఎందుకంటారా..!

విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ కొద్ది రోజుల క్రితం ఇటలీలో పెళ్ళి చేసుకున్న సంగతి తెలిసిందే..! అలాగే రెండు, మూడు చోట్ల రిసెప్షన్ కూడా ఇచ్చారు. అయితే వారు మరోసారి పెళ్ళి చేసుకోబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. ఇంతకూ ఇంకోసారి పెళ్ళి చేసుకోవడం ఎందుకని అంటారా..? మ్యారేజ్ సర్టిఫికేట్ కోసమట.

ఇటలీలో పెళ్లి చేసుకోవడంతో, వీరికి మ్యారేజ్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు అధికారులు నిరాకరించినట్టు బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. దీంతో పెళ్లి ధ్రువీకరణ కోసం వీరు ఇండియాలో మళ్లీ పెళ్లి చేసుకోనున్నారని తెలుస్తోంది. ఇటలీలోని టస్కనీలో పెళ్లి చేసుకున్నవీరు, ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం విరాట్ కోహ్లీ సౌత్ ఆఫ్రికా టూర్ లోనూ.. అనుష్క శర్మ జీరో సినిమా షూటింగ్ లోనూ బిజీగా ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here