ఈ ఆకుపచ్చ రంగులో ఉన్న జీవి ఏంటో మీకు తెలుసా..?

ఇక్కడ ఆకుపచ్చ రంగులో ఉన్న జీవి గురించి చాలా మందికి తెలీదు. దీని పేరు బొనెల్లియా విరిదిస్.. మామూలుగా దీన్ని గ్రీన్ స్పూన్ వార్మ్ అని అంటారు. ఇవి సాధారణంగా 65 అడుగుల లోతు పైన ఉన్న నీటి ప్రాంతాల్లో బ్రతుకుతూ ఉంటాయి. ఇవి గరిష్టంగా 6 ఇంచీలు పెరుగుతాయి. ఇవి ఆడవో.. మగవో తెలుసుకోవాలంటే అవి యుక్త వయసు లోకి రావాలి.. అప్పుడే కనుక్కోవచ్చట. అయితే మగ గ్రీన్ స్పూన్ వార్మ్ తో పోల్చుకుంటే ఆడది చాలా పెద్దవిగా ఉంటాయట.

దీని జన్మస్థానం దక్షిణ ఆస్ట్రేలియా అయినప్పటికీ.. మధ్యధరా సముద్రం లోనూ, ఎర్ర సముద్రం, అట్లాంటిక్ మహా సముద్రం లోనూ కనిపిస్తూ ఉంటాయి. ఈ జీవులకు సాగే గుణం ఎక్కువగా ఉంటుంది. దాని సైజుతో పోలిస్తే దాదాపు 10 రెట్లు ఎక్కువగా ఇవి సాగగలవు. సముద్రంలో ఉంటే జంతువుల వ్యర్థాలను తిని ఇవి బ్రతుకుతూ ఉంటాయి. అంతే కాకుండా వీటిలో ఉన్న న్యూరల్ పాయిజన్ ద్వారా చిన్న చిన్న జంతువులను చంపి వాటిని తింటూ ఉంటాయి కూడానూ..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here