రోడ్డు మీద గాయాల‌తో ప‌డున్న వ్య‌క్తికి అక్క‌డిక‌క్క‌డే చికిత్స చేసి, కుట్లు కూడా వేసిన డాక్ట‌ర్‌

బ‌ళ్లారి: రోడ్డు ప్ర‌మాదానికి గురై, తీవ్ర గాయాల‌తో ప‌డున్న ఓ వ్య‌క్తికి స‌కాలంలో వైద్యాన్ని అందించి ప్రాణాల‌ను నిలిపాడో డాక్ట‌ర్‌. సంఘ‌ట‌నాస్థ‌లంలోనే అత‌నికి ప్రాథ‌మిక చికిత్స చేశాడు. త‌న వెంట ఉన్న మెడిక‌ల్ కిట్‌తో అత‌నికి అప్ప‌టిక‌ప్పుడు, అక్క‌డిక‌క్క‌డే చికిత్స అందించాడు. గాయాల‌కు బ్యాండేజీ క‌ట్ట‌డంతో పాటు అవ‌స‌ర‌మైన చోట కుట్లు కూడా వేశాడు.

ఈ ఘ‌ట‌న క‌ర్ణాట‌క‌లోని బ‌ళ్లారిలో చోటు చేసుకుంది. ఆ డాక్ట‌ర్ పేరు యువ‌రాజ్‌. హొస్పేట‌-బ‌ళ్లారి మార్గ‌మాధ్య‌లో ఓ రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. మితిమీర‌న వేగంతో ఓ కారు ఎదురుగా వ‌స్తోన్న బైక్‌ను ఢీ కొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో బైక‌ర్ తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. ర‌క్త‌పుమ‌డుగులో రోడ్డు ప‌క్క‌న ప‌డిపోయాడు.

అదే మార్గంలో త‌న కారులో వెళ్తోన్న డాక్ట‌ర్ యువ‌రాజ్ అత‌ణ్ణి గ‌మ‌నించారు. వెంట‌నే అత‌నికి ప్రాథ‌మిక చికిత్స అందించారు. గాయాల‌కు క‌ట్టుక‌ట్టారు. అద్దం గుచ్చుకుని కాలు, చెయ్యి తెగితే.. వాటికి కుట్లు వేశారు. చికిత్స చేసిన అనంత‌రం త‌న కారులోనే స‌మీప ఆసుప‌త్రికి తీసుకెళ్లారు. స్థానికుడొక‌రు ఈ దృశ్యాన్ని త‌న మొబైల్‌లో చిత్రీక‌రించారు. దాన్ని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. డాక్ట‌ర్ యువ‌రాజ్ చూపిన మాన‌వ‌త్వంపై ప్ర‌శంస‌లు అందుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here