ఆసుప‌త్రిలో దుకాణం పెట్టేశారు..డాక్ట‌ర్లూ వారితో జ‌త క‌లిశారు!

కొంద‌రు వ్య‌క్తులు పేకాట ఆడుతున్న ఫొటో ఇది. ఈ పేకాట ఆడుతున్న‌ది ఏ క్ల‌బ్బులోనో, ఊర‌వ‌త‌ల ఉన్న మ‌ర్రిచెట్టు కింద పంపుసెట్టు రూములోనో కాదు.

రోజూ వంద‌ల‌ సంఖ్య‌లో రోగులు వ‌చ్చే ప్ర‌భుత్వ ఆసుప‌త్రి. జిల్లా కేంద్రంలోని పెద్దాసుప‌త్రి. అలాంటి చోటే దుకాణం పెట్టేశారు ఆసుప‌త్రి కాంపౌండ‌ర్‌, ఇత‌ర సిబ్బంది.

ఇలా ప‌బ్లిగ్గా ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల్లో పేకాట ఆడుతోన్న సిబ్బందిని మెడ‌ప‌ట్టి బ‌య‌టికి గెంటేయాల్సిన బాధ్య‌త డాక్ట‌ర్ల‌పై ఉంది క‌దా! అలా జ‌ర‌గ‌లేదు. డాక్ట‌ర్లు కూడా వారితో జ‌ట్టుక‌ట్టారు. తామూ ఓ చెయ్యి వేశారు.

పేక‌ముక్క‌ల‌ను క‌ల‌ప‌డంలో మునిగిపోయారు. ఈ ఘ‌ట‌న క‌ర్ణాట‌క‌లోని విజ‌య‌పుర జిల్లాలో చోటు చేసుకుంది. ఇది ఏ ఒక్క‌రోజో చోటు చేసుకున్న ఘ‌ట‌న కాదు. రోజూ ఇదే తంతుగా సాగుతోంది.

ఆసుప‌త్రి సీనియ‌ర్ కాంపౌండ‌ర్ రాజీవ్ బ‌ళ్లారి, అంబులెన్స్ డ్రైవ‌ర్ పాండు నేతృత్వంలో ప్ర‌తిరోజూ పేకాట ఆ ఆసుప‌త్రిలో జోరుగా సాగుతోంది. వారికి డాక్ట‌ర్లు కూడా జ‌త కావ‌డంతో అడ్డనేదే లేకుండా పోయింది.

ఈ పెద్దాసుప‌త్రికి జిల్లా ప్ర‌జ‌లే కాదు, పొరుగునే ఉన్న మ‌హారాష్ట్ర నుంచి కూడా వైద్యం కోసం రోగులు వ‌స్తుంటారు. అయిన‌ప్ప‌టికీ వారు ఏ మాత్రం లెక్క‌చేయ‌ట్లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here