గ‌ర్భ‌వ‌తినంటూ ఆసుప‌త్రికెళ్లింది..స్కానింగ్ రిపోర్ట్ చూసిన డాక్ట‌ర్లు మూర్ఛ‌పోయారు!

త‌న‌కు నాలుగో నెల అని, రెండురోజులుగా క‌డుపునొప్పి వ‌స్తోందంటూ ఆసుప‌త్రికి వెళ్లిందో మ‌హిళ‌. ఆమె పేరు గ్లోరియా. 37 సంవ‌త్స‌రాలు. మెక్సికో రాజ‌ధాని మెక్సికో సిటీలో నివాసం ఉంటోంది. క‌డుపునొప్పి, పొత్తి క‌డుపులో నొప్పి బాధిస్తుండ‌టంతో మూడురోజుల కింద‌ట మెక్సికో సిటీలోని రూబెన్ లెనెరో ఆసుప‌త్రికి వెళ్లింది.

 

ఆమె వ‌య‌స్సు ఎంతో తెలుసుకున్న డాక్ట‌ర్లు.. లేటు వ‌య‌స్సులో గ‌ర్భం దాల్చితే కొన్ని అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని స‌ర్ది చెప్పారు. య‌థావిధిగా ఆమెకు ప‌రీక్ష‌లు చేశారు. స్కానింగ్ రిపోర్ట్ వ‌చ్చిన త‌రువాత, దాన్ని చూసిన డాక్ట‌ర్లకు మూర్ఛ‌పోయినంత ప‌నైంది. కార‌ణం- ఆమె క‌డుపులో పిండమే లేదు.

పిండం బ‌దులుగా ఆమె క‌డుపులో ఉన్న‌ది చూసి ఉలిక్కిప‌డ్డారు. వెంట‌నే పోలీసుల‌కు ఫోన్ చేశారు. ఆమె క‌డుపులో గంజాయి పాకెట్లు. పొత్తి క‌డుపులోనే కాదు, మ‌ర్మాంగంలో కూడా గంజాయి పాకెట్లు ఉన్నాయి. వాటి బ‌రువు ఒక‌ కేజీ. ఆ గంజాయి పాకెట్ల‌లో ఒక‌టి చిరిగిపోవ‌డంతో ఆమెకు తీవ్ర‌మైన క‌డుపునొప్పి వ‌చ్చిన‌ట్టు డాక్ట‌ర్లు గుర్తించారు.

పొత్తిక‌డుపుతో పాటు మ‌ర్మాంగంలో కూడా గంజాయి పాకెట్లు ఉన్నాయి. వెంట‌నే-గ్లోరియాకు శ‌స్త్ర చికిత్స చేసి, ఆ పాకెట్ల‌ను తొల‌గించారు. తాను గ‌ర్భం దాల్చ లేద‌ని, గంజాయిని స్మ‌గ్లింగ్ చేస్తోన్న విష‌యం గ్లోరియాకు తెలుసు.

తాను జైలు పాల‌వుతాన‌ని తెలిసి కూడా క‌డుపునొప్పిని త‌ట్టుకోలేక ఆమె పోలీసుల‌ను ఆశ్ర‌యించింది. ఆ గంజాయి ఎక్క‌డి నుంచి వ‌చ్చిందో చెప్ప‌డానికి గ్లోరియా నిరాక‌రించారు. అది చెబితే త‌న ప్రాణానికే ప్ర‌మాద‌మ‌ని అంటున్నారు. మెక్సికోలో గంజాయి, డ్ర‌గ్స్.. ఇత‌ర మాద‌క ద్ర‌వ్యాలు య‌థేచ్ఛ‌గా ర‌వాణా అవుతుంటాయి.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here