నెయిల్ క్లిప్పర్ ని మింగేసిన పిల్లోడు..!

చిన్న పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. వారి చేతికి ఏది దొరికినా మొదట నోట్లోకి పెట్టుకోవడానికే చూస్తూ ఉంటారు. అది వాళ్ళ నైజం.. కొన్నిటిని ఉమ్మేస్తారు.. మరి కొన్నిటిని మింగేస్తారు. అందుకే వాళ్ళ చేతుల్లో ఏముందో.. నోట్లో ఏమైనా పెట్టుకున్నారేమోనని తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి.

తాజాగా చైనాకు చెందిన ఓ పిల్లాడు ఏకంగా నెయిల్ క్లిప్పర్ ను మింగేశాడు. దీంతో వెంటనే వైద్యుల వద్దకు పిల్లాన్ని తీసుకొని వెళ్ళారు. వైద్యులు కష్టపడి దాన్ని బయటకు తీశారు. తన బిడ్డ చేతిలో ఓ నెయిల్ క్లిప్పర్ ఉండడాన్ని ఆ తల్లి చూసింది. అయితే అతడి చేతిలో నుండి దాన్ని తీసేసుకోబోయే లోపే ఆ పిల్లాడు పరిగెత్తుకొని వెళ్ళిపోయాడు. నోట్లో ఆ నెయిల్ క్లిప్పర్ ను వేసుకొని మింగేశాడు. దీంతో భయపడిపోయిన ఆ చిన్నారి తల్లి తండ్రులు ఆసుపత్రికి తీసుకొని వెళ్ళారు. ఆ తర్వాత వైద్యులు ఎండోస్కోపీ నిర్వహించి ఆ పిల్లాడు కడుపులో ఉన్న దాన్ని బయటకు తీసేశారు. పిల్లాడిని ఆసుపత్రి నుండి డిశ్చార్జి చేశారు. ఆ పిల్లాడి వయసు 16 నెలలు..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here