పిండం కాదు గానీ..గ‌ర్భసంచిలో పెరుగుతూ క‌నిపించింది! స్కానింగ్ చేసిన డాక్ట‌ర్లు ఉలిక్కిప‌డ్డారు!

వ‌రంగ‌ల్‌: అత్యంత అరుదుగా సంభ‌వించే ప‌రిణామం ఇది. ఓ మ‌హిళ గ‌ర్భ‌సంచిలో అరుదైన క‌ణితి ఏర్ప‌డింది. ఇది అరుదైన ఘ‌ట‌నే అని డాక్ట‌ర్లు చెబుతున్నారు. సాధార‌ణంగా క‌ణితి గ‌ర్భ‌సంచిలో ఏర్ప‌డ‌టం అసాధ్యం.

అలా అరుదుగా ఓ మ‌హిళ గ‌ర్భ‌సంచిలో ఏర్ప‌డిన క‌ణితిని డాక్ట‌ర్లు ఆప‌రేష‌న్ చేసి తొల‌గించారు. దాని బ‌రువు ఒక‌టిన్న‌ర కేజీలు. ఇంకో అర కేజీ పెరిగి ఉంటే ప్రాణాల‌కే ప్ర‌మాదం ఏర్ప‌డి ఉండేద‌ని అంటున్నారు. ఆ మ‌హిళ పేరు ప‌ద్మ‌. 45 సంవ‌త్స‌రాలు.

తెలంగాణ‌లోని జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి జిల్లాకు చెందిన ప‌ద్మ‌.. కొద్దిరోజులుగా క‌డుపు నొప్పితో బాధ ప‌డుతున్నారు. అది మ‌రింత తీవ్రం కావ‌డంతో ప‌ర‌కాల‌లో ప్ర‌భుత్వాసుప‌త్రికి వెళ్లారు. అక్క‌డ ఆమెకు స్కానింగ్ చేసి చూసిన డాక్ట‌ర్లు ఉలిక్కిప‌డ్డారు.

 

అత్యంత అరుదుగా గ‌ర్భ‌సంచిలో ఆమెకు క‌ణితి ఏర్ప‌డింది. దాన్ని గుర్తించిన వెంట‌నే డాక్ట‌ర్లు శ‌స్త్ర చికిత్స చేసి తొల‌గించారు. ప్ర‌స్తుతం ప‌ద్మ ఆసుప‌త్రిలో కోలుకుంటున్నారు. ఆమె ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉంద‌ని డాక్ట‌ర్లు చెప్పారు. ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలోనే దాన్ని తొల‌గించ‌డం చెప్పుకోద‌గ్గ విశేషం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here